నేటికాలంలో సోషల్ మీడియా వినియోగం బాగా ఎక్కువైంది. చాలా మంది ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు సోషల్ మీడియాలోనే గడిపేస్తుంటారు. ముఖ్యంగా ఎక్కువ మంది యువత యూట్యూబ్ ను వినియోగిస్తుంటారు. విద్యార్ధులు, యువకులు, ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవారు కూడా తమ అవసరల కోసం సోషల్ మీడియాను ఉపయోగిస్తుంటారు. అయితే తాజాగా ఓ యువకుడు విచిత్రమైన వాదనతో కోర్టు మెట్లు ఎక్కాడు. యూట్యూబ్ లో వచ్చే అశ్లీల యాడ్స్ కారణంగా తాను పోటీ పరీక్షల్లో తప్పానని కోర్టులో పిటిషన్ వేశాడు. అతడి పిటిషన్ ను స్వీకరించిన న్యాయస్థానం సదరు వ్యక్తి షాక్ ఇచ్చింది. కోర్టు ఇచ్చిన తీర్పుకు సదరు పిటిషనర్ కు దిమ్మతిరిగి బొమ్మ కనుపడింది. మరోసారి కోర్టుకు ఇలాంటి ఫిర్యాదులతో రాను అంటూ న్యాయమూర్తికి విన్నవించుకున్నాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
మధ్యప్రదేశ్ కు చెందిన ఓ యువకుడు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. ఇటీవల జరిగిన ఓ పరీక్షలో ఆ యువకుడు ఫైయిల్ అయ్యాడు. తాను ఫెయిల్ కావడానికి.. యూట్యూబ్ లో వచ్చే అశ్లీ వీడియోలే కారణంమంటూ సుప్రీం కోర్టు మెట్లు ఎక్కాడు. అంతేకాక గూగుల్ ఇండియా నుంచి తనకు రూ.75 లక్షలు పరిహారం ఇప్పించాలని పిటిషన్ లో కోరాడు. అతడి పిటిషన్ స్వీకరించిన న్యాయస్థానం విచారణ చేపట్టింది. అంతేకాక ఈ వ్యాజ్యంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి పిటిషన్ల కారణంగా ఎంతో విలువైన న్యాయ వ్యవస్థ సమయం వృథా అవుతోందని కోర్టు సీరియస్ అయింది. దీంతో సదరు యువకుడు వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడంతో పాటు పిటిషనర్ కు జరిమాన కూడా విధించింది.
ఇంటర్నెట్ లో వచ్చే యాడ్స్ చూసి పరీక్షల్లో ఫెయిల్ కావడం ఏంటని పిటిషనర్ ను కోర్టు ప్రశ్నించింది. అసలు ఆ ప్రకటలను ఎవరూ చూడమన్నారు అంటూ యువకుడికి గట్టిగా అక్షింతలు వేసింది. ఇంతకంటే ఘోరమైన పిటిషన్ మరొకటి ఉండదని, ఇలాంటివి మరోసారి రిపీట్ కాకుండా కోర్టు యువకుడి షాకిచ్చింది. కోర్టు సమయాని వృథా చేశాడని.. అతడికి లక్ష రూపాయలు జరిమాన విధిస్తూ జస్టిస్ ఎస్ కే కౌల్, జస్టిస్ ఏఎస్ ఓకాతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది. కోర్టు ఇచ్చిన తీర్పు యువకుడికి దిమ్మతిరిగి బొమ్మ కనపడింది. తాను నిరుద్యోగినని, అంత పెద్ద మొత్తంలో జరిమానా చెల్లించలేని కోర్టు మొరపెట్టుకున్నాడు. దీంతో అతడి విజ్ఞప్తి పరిశీలించిన కోర్టు.. జరిమానాను రూ.25 వేలకు తగ్గించింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.