కొందరు మానసిక స్థితి సరిగ్గా ఉండక రోడ్ల వెంబడి తిరుగుతుంటారు. మరికొందరు శృతిమించి ప్రజలపై దాడికి పాల్పడుతుంటారు. వ్యక్తిగత కారణలతో, ఇతర సమస్యలతో కొందరు పిచ్చివారిగా మారిపోతారు. అతడి బాధ చూసి కుటుంబ సభ్యులు మానసిక వేదనకు గురవుతుంటారు. ఇతరులపైకి రాళ్లు వేయడం, లేదా వారే రాళ్లకేసి తలను కొట్టుకోవడం వంటివి చేస్తుంటారు. దీంతో అతడు ఎప్పుడు ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడతాడో అని.. కుటుంబ సభ్యులు భయం భయంగా గడుపుతుంటారు. తాజాగా ఓ యువకుడు కూడా అలానే కరెంట్ తీగలపై నడుస్తూ వీరంగ సృష్టించాడు. ఆ మతిస్థిమితంలేని యువకుడు పోలీసులనకు చెమటలు పట్టించాడు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే..
కేరలోని కాసరగోడ్ మున్సిపాలిటీ పరిధిలోని మావుగళ్ళూ గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని ఓ యువకుడు వీరంగ సృష్టించాడు. అక్కడే ఉన్న ట్రాన్స్ ఫార్మర్ వద్ద తిరుగుతూ తెగ హంగామా చేశాడు. అతడు ట్రాన్స్ ఫార్మర్ పైకి ఎక్కేందుకు తెగ ప్రయత్నం చేశాడు. దీంతో అక్కడి వారు భయాందోళనకు గురయ్యారు. వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు, అగ్నిమాపకు సిబ్బంది సమాచారం అందిచారు. దీంతో వెంటనే ఆ పరిధిలో విద్యుత్ ను నిలిపివేశారు విద్యుత్ శాఖ అధికారులు. స్థానికులు అనుకున్నట్లుగానే ఆ పిచ్చి వ్యక్తి 9 మీటర్ల ఎత్తు ఉన్నా ఆ ట్రాన్స్ ఫార్మర్ ఎక్కి.. అక్కడి నుంచి కరెంట్ తీగలపైకి నడుచుకుంటూ వెళ్లాడు.
అయితే అప్పటికే అధికారులు విద్యుత్ ను నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఇంతలో అక్కడి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు అతడి కింద దించేందుకు ఎంతో ప్రయత్నించారు. ఆ మతిస్థిమితంలేని ఆ వ్యక్తి .. అటు, ఇటు, పైకి కిందకు తీగలపై గెంతులు వేస్తూ పోలీసులను ముప్పు తిప్పలు పెట్టాడు. కిందకి దిగమిని వారు బ్రతిమిలాడిన..నేను దిగను అంటూ పెద్ద పెద్దగా కేకలు వేశాడు. దాదాపు గంట సేపు పోలీసులకు సదరు వ్యక్తి చుక్కలు చూపించాడు. చివరకు గంట సమయం తరువాత అన్ని దిక్కుల నుంచి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చుట్టుముట్టి అతడి పట్టుకున్నారు.
దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇతడు మానసిక చికిత్స కేంద్రం నుంచి తప్పించుకుని వచ్చినట్లు స్థానికులు తెలిపారు. గతంలోనూ ఓ సారి చెరవత్తూరు రైల్వే స్టేషన్ లో అలానే చేయడంతో మానసిక చికిత్స కేంద్రాన్నికి తరలించామని.. అక్కడి నుంచి తప్పించుకుని వచ్చి ఇలా కరెంట్ తీగలపై నడుస్తూ అందరిని భయందోళనకు గురిచేశాడని స్థానికులు తెలిపారు. ఇలాంటి ఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.