భారత్ ను ఎప్పుడెప్పుడు దెబ్బతీయాల అని పాకిస్తాన్ ఎదురుచూస్తుంటుంది. పాక్ ప్రోద్భలంతో అనేక మంది ఉగ్రవాదులు అక్కడి నుంచి భారత్ లో చొరబడే ప్రయత్నాలు చేస్తున్నారు. వారితో పాటు ఆయుధాలను, ఇతర పేలుడు పదార్ధాలను తీసుకోస్తుంటారు. వీరి కుట్రలను భారత్ సైనికులు ధీటుగానే తిప్పికొడుతున్నారు. తాజాగా మరోసారి అలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. పాకిస్థాన్ నుంచి తెలంగాణకు ఆయుధాలు సరఫరా చేస్తున్న అనుమానిత ఉగ్రవాదుల గుట్టును పోలీసులు రట్టు చేశారు. హార్యానాలోని కర్నాలో ఆ నలుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేయటంతో పన్నాగం బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
హర్యానాలోని ఓ టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈక్రమంలో నలుగురు అనుమానిత ఖలిస్తానీ ఉగ్రవాదుల్ని అరెస్టు చేశారు. వారి నుంచి భారీ స్థాయిలో ఆయుధాలను, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహారాష్ట్రలోని నాందేడ్, తెలంగాణలోని ఆదిలాబాద్ కు ఆ పేలుడు పదార్థలను సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. ఈ ఖలిస్తానీ ఉగ్రవాదులకు పాకిస్థాన్ తో లింక్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైనా గుర్నీత్ గతంలో జైలు శిక్ష కూడా అనుభవించాడు. అతడి తో పాటు ఉన్న మరో ముగ్గుర్ని భూపిందర్, అమన్‌దీప్, పర్మిందర్‌గా గుర్తించారు. పాకిస్థాన్ ఉగ్రవాది హర్వింద్ సింగ్ నుంచి ఆదేశాలు తీసుకుని ఈ నలుగురు పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు.
ఐఈడీలను ఆ కారులో తీసుకువెళ్తున్నారు. వాటిని ఇండియా అంతా డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. అరెస్టు కావడానికి ముందు కనీసం రెండు స్థలాల్లో ఐఈడీలను పంచి ఉంటారని భావిస్తున్నారు. దేశవాళీ పిస్తోల్, 31 బుల్లెట్లు, ఐఈడీలతో ఉన్న మూడు ఐరన్ కంటేయినర్లు,1.3 లక్షల నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ నలుగురు కొరియర్లుగా ఆదిలాబాద్‌కు ఆయుధాలను చేరవేస్తున్నట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోందని కర్నాల్ రేంజ్ ఐజీ సత్యేందర్ కుమార్ గుప్తా తెలిపారు.మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.