ఈ మధ్యకాలంలో అక్కడక్కడ తరచూ రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలా రైలు ప్రమాదాల కారణంగా అనేక మంది అమయాకులు ప్రాణాలు కొల్పోతున్నారు. మరికొందరు తీవ్రంగా గాయబడి బ్రతికి ఉన్నా జీవచ్ఛవాల్లా జీవితాన్ని వెల్లదీస్తున్నారు. ఇప్పటికే అనేక పెద్ద రైలు ప్రమాద ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా బీహార్ లోని గయా ప్రాంతంలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఆ రైలుకు సంబంధించిన 53 బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. అయితే ఈ ఘటన జరిగే సమయంలో ఇతర రైలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
బీహార్ లోని గయా జిల్లాలో బుధవారం ఉదయం హజారీ బాగ్ నుంచి దాద్ రీ కి బొగ్గుతో వెళ్తున్న రైలు పట్టాలు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ రైలుకు సంబంధించిన 53 బోగీలు చెల్లాచెదురయ్యాయి. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఆ మార్గం లో వెళ్లే పలు రైళ్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆ పరిధిలోని పలు స్టేషన్లలో రైళ్లను నిలిపివేశారు. పలు రైళ్లను దారి మళ్లీంచారు. ధన్ బాద్ డివిజన్ పరిధిలోని కొడెర్మా- మన్ పూర్ రైల్వేస్టేషనా్ల మధ్య బుధవారం తెల్లవారు జామున 6.45 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.అయితే బొగ్గు లోడుతో వెళ్తున్న ఈ గూడ్స్ రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, పట్టాలపై పడిపోయిన బోగీలను తొలగించి వెంటనే రైళ్ల రాకపోలను పునరుద్దఱించేందుకు రైల్వే బృందాలు కృషి చేస్తున్నాయని అధికారులు తెలిపారు. రైలు పట్టాలు తప్పే సమయంలో డ్రైవర్, ఇతర అధికారులు అప్రమత్తమవటంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
A goods train derails between Koderma and Manpur railway stations under #Dhanbad railway division. pic.twitter.com/Age2J3wcRa
— TOI Patna (@TOIPatna) October 26, 2022