నేటి రాజకీయాల్లో సర్పంచి ఎన్నిక కూడా ఎమ్మెల్యే ఎన్నికల స్థాయిలో తీవ్ర పోటీ ఉంటుంది. కారణం.. సర్పంచి ఎన్నికలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం. చాలా మంది సర్పంచి కావాలనే ఆశతో ఎన్నికల బరిలో దిగుతుంటారు. ఆ పదవిని ఎలాగైన దక్కించుకోవాలనే కసితో ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడటం లేదు. అలా గ్రామ స్థాయి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వారు ఉన్నారు. ఓటమిపాలై.. ఆస్తులు మొత్తం పొగొట్టుకుని రోడ్డున పడిన వారు ఉన్నారు. అయితే ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తి ఇంటి ముఖం కూడా చాలా మంది చూడరు. అయితే ఓ గ్రామంలో మాత్రం సర్పంచి ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్ధిని లక్షల్లో డబ్బులు ఇచ్చి.. మద్దతుగా నిలబడ్డారు. ఈ అరుదైన ఘటన హరియాణాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
హరియాణా రాష్ట్రం ఫతేహాబాద్ లోని నధోడి గ్రామ పంచాయతికి ఎన్నికలు జరిగాయి. ఇందులో సుందర్, నరేంద్ర అనే ఇద్దరు అభ్యర్ధులు పోటీ చేశారు. సర్పంచి పదవిని ఇద్దరు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎవరికి వారే గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఆ గ్రామంలో మొత్తం 5,090 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల్లో 4,420 ఓట్లు పోలవగా.. అందులో సుందర్ కి 2,200 ఓట్లు పడగా, నరేందర్ కు 2,201 ఓట్లు వచ్చాయి. దీంతో నరేందర్..సుందర్ పై ఒక్క ఓటు తేడాతో విజయం సాధించాడు. అయితే సుందర్ కూడా గెలుపు అంచుల వరకు వచ్చి ఓడిపోవడంతో గ్రామస్తులు సైతం కలత చెందారు. దీంతో అతడు కూడా విజేత అన్నట్లుగా గ్రామస్థులు సన్మానించారు.
ఎన్నికల్లో పోరాడి ఓడిపోయిన సుందర్ ను గ్రామస్థులు సన్మానించారు. అంతేకాక అతడికి రూ.11.11 లక్షల డబ్బులు, ఓ స్విఫ్టి కారు, కొంత భూమిని సైతం ఇచ్చారు. గ్రామస్థులు చూపిన అభిమానానికి సుందర్ కంటి వెంట ఆనందబాష్పాలు వచ్చాయి. అలానే ఫరీదాబాద్ జిల్లా ఫతేపూర్ తాగా గ్రామానికి కూడా ఎన్నికలు జరిగాయి. ఇక్కడ కొత్త ఎన్నికైన సర్పంచ్ ని గ్రామస్థులు సన్మానించారు. ఈయనకి కూడా రూ.11 లక్షల విలువైన ఐదు వందల రూపాయల నోట్లతో గజమాల వేసి సన్మానించారు. దీంతో అంతడు గ్రామస్థులుకు రుణపడి ఉంటానని, పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపాడు