మనిషి జీవితం అనేది రక్త సంబంధాలు నడుమ సాగే ఓ ప్రయాణం. అందుకే కుటుంబ సభ్యులు పరస్పరం ఎంతో ప్రేమానురాగాలు కలిగి ఉంటారు. కుటుంబ సభ్యులో ఎవరైన మరణిస్తే.. ఆ వేదన వర్ణణాతీతం. అదే చనిపోయాడనుకున్న వ్యక్తి తిరిగి ప్రత్యక్షమైతే.. ఆ ఆనందానికి అవధులు ఉండవు. అలాంటి ఘటనే ఓ కుటుంబంలో జరిగింది.
మనిషి జీవితం అనేది రక్త సంబంధాలు నడుమ సాగే ఓ ప్రయాణం. అందుకే కుటుంబ సభ్యులు పరస్పరం ఎంతో ప్రేమానురాగాలు కలిగి ఉంటారు. ముఖ్యంగా పిల్లలపై తల్లిదండ్రులకు అమితమైన ప్రేమ ఉంటుంది. వారికి ఏ కష్టం రాకుండా పెంచి పెద్ద చేస్తుంటారు. అయితే ఇలా చేతికి అందివచ్చిన పిల్లలు విధి ఆడిన వింత నాటకంలో దూరమవుతుంటారు. బిడ్డల జ్ఞాపకాలు తలుచుకుని తల్లిదండ్రులు నరకవేదన అనుభవిస్తుంటారు. అయితే అనుకోని పరిస్థితుల్లో చనిపోయిన తమ బిడ్డ తిరిగి ప్రత్యక్షమైతే.. ఇక ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు. ఇలా కూడా జరుగుతుందా? అనే సందేహం మీకు రావచ్చు. అవునూ మధ్యప్రదేశ్ లో అలానే జరిగింది. మరి.. ఈ స్టోరీ వెనుక ఉన్న మిస్టరీ ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం..
రెండేళ్ల క్రితం కరోనా మహమ్మారి సృష్టించిన విలయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ వైరస్ కారణంగా ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డాయి. ఎందరో అనాథలుగా మారారు. ఎందరో తల్లిదండ్రులకు తమ బిడ్డలు దూరమై కడుపుకోత మిగిల్చింది. అలానే మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లా కరోడ్కల గ్రామానికి చెందిన కమలేశ్ పాటిదార్(35) కూడా ఈ మహమ్మారి కాటుకు బలయ్యాడు. 2021లో కరోనా రెండో ఉద్ధృతి సమయంలో కమలేశ్ పాటిదార్ (35)కు కరోనా సోకింది. దీంతో ఆయన కుటుంబసభ్యులు గుజరాత్‌లోని వడోదర ఆస్పత్రిలో చేర్చారు.
కరోనా మహమ్మారితో పోరాడుతూ కమలేశ్ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. అప్పటి నిబంధనల ప్రకారం కమలేశ్ మృతదేహానికి కుటుంబ సభ్యులు గుజరాత్ లోనే అంత్యక్రియలు నిర్వహించి, మధ్యప్రదేశ్ కు తిరిగి వచ్చారు. కుమారుడి జ్ఞాపకాలతో ఆ తల్లిదండ్రులు రెండేళ్లుగా కాలం వెలదీస్తున్నారు. ఈ క్రమంలో దాదాపు రెండేళ్ల తర్వాత కమలేశ్ కరోడ్కల గ్రామంలోని తన ఇంటికి వచ్చాడు. చనిపోయాడనుకున్న వ్యక్తి ఒక్కసారిగా ప్రత్యక్షం కావడంతో కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారు. ఇన్నాళ్లు ఎక్కడున్నావని ప్రశ్నించగా.. అతని నుంచి సరైన సమాధానం రాలేదు.
దీంతో వారు పోలీసులను ఆశ్రయించగా కమలేశ్ ను విచారించాక స్పష్టత వస్తుందని తెలిపారు. ఆసుపత్రిలో ఏదైనా పొరపాటు జరిగిందా? అనే విషయం కూడా విచారణలో తేలాల్సి ఉంది. అయితే కరోనా సమయంలో చనిపోయిన వేరే వ్యక్తి మృతదేహాన్ని పొరపాటున కమలేశ్ అని అతడి తల్లిదండ్రులకు అప్పగించి ఉండొచ్చని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైన చనిపోయాడనుకున్న వ్యక్తి తిరిగి వస్తే ఆ సంతోషం చెప్పలేము. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.