నేటికాలంలో మనిషిలో సహనం అనేది కనిపించడంలేదు. ప్రతి చిన్న విషయానికి పగలు ప్రతీకారాలు అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నలుగురిలో చిన్న అవమానం జరిగిన కొందరిలో పగలు ఏర్పడతాయి. తాజాగా ఓ వ్యక్తి.. నలుగురిలో పోలీస్ తన పై చేయి చేసుకోవడాని అవమానంగా భావించాడు. దీంతో ఆవేశం ఉండబట్టలేక ప్రతీకారం తీర్చుకోవాలని భావించి ఏకంగా పోలీసుల ఔట్ పోస్ట్ వద్ద తన బైక్‌ను తగులబెట్టాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..
ఢిల్లీకి చెందిన నదీమ్(23) అనే యువకుడు జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. శనివారం పోష్ ఖాన్ మార్కెట్‌లోని ఓ రెస్టారెంట్‌లో ఆర్డర్ తీసుకెళ్లడానికి నదీమ్ వెళ్లాడు. ఫుడ్ పార్సిల్ కోసం ఆ యువకుడు అక్కడే వేచి చూస్తుండగా ఓ జంట వచ్చింది. ఈక్రమంలో నదీమ్ తనను అదేపనిగా చూసి ఇబ్బందికి గురిచేశాడని ఆరోపిస్తూ అక్కడ ఔట్‌పోస్ట్ పోలీసులకు మహిళ ఫిర్యాదు చేసింది. దీనిపై ఆమె నుంచి ఎలాంటి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు తీసుకోకుండా డ్యూటీలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్.. నదీమ్‌ను పిలిపించాడు. ఆ యువకుడిని మందలించి చెంపదెబ్బ కొట్టాడు. అందరిలో చెప్పు దెబ్బ తినడంతో నదీమ్ తీవ్రంగా కలత చెందాడు. ఆ మరుసటి రోజే తన బైక్ ను ఔట్ పోస్ట్ వద్దకు తీసుకెళ్లి పోలీసుల ముందే పెట్రోల్ పోసి తగులపెట్టాడు. అయితే వెంటనే స్పందించిన పోలీసులు , అగ్నిమాపక సిబ్బంది బైక్ కి అంటుకున్న మంటలను ఆర్పేశారు.
అయితే బైక్ తగలబడుతుండగా సమీపంలోని ఫర్నిచర్ షాప్ వరకూ మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక యంత్రం సాయంతో మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే బైక్ ను నిప్పంటించిన తర్వాత నిందితుడు పారిపోయే ప్రయత్నం చేశాడు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు నిందితుడు రాళ్లు రువ్వాడు. ఈ ఘటన మొత్తానికి స్థానికులు తమ కెమెరాల్లో బంధించారు. చాలా సమయం తరువాత పోలీసులు అతడ్ని అతి కష్టంతో అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో అక్కడ జనం భారీగా గుమిగూడారు. ఈ ఘటనతో అక్కడ ఉండే ప్రముఖ రెస్టారెంట్లు, షోరూమ్‌ల యజమానులు,స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Delhi Man’s Revenge After Cops Slapped Him For Allegedly Ogling Woman https://t.co/KQyYnuiftw pic.twitter.com/NJJle7IrM2
— NDTV News feed (@ndtvfeed) October 25, 2022
A man, in an inebriated condition, set his bike on fire in front of a police post in #Delhi‘s #Khanmarket area, and also pelted stones and bricks damaging the police property.
The accused, identified as #Nadeem, a resident of #HauzRani, was arrested on the spot. pic.twitter.com/Gn730qgjKi
— THE UNCUT NEWS STORY (@StoryUncut) October 25, 2022