అక్రమ సంపాదనకు అలవాటుపడి కొందరు కేటుగాళ్లు దందాలకు, మోసాలకు పాల్పడుతుంటారు. అలా పేదలకు డబ్బు ఆశ చూపి, వారి ముగ్గులోకి దింపి చివరికి దారుణంగా మోసం చేస్తారు. కొన్ని సందర్భాల్లో బాధితులు బయటకి వస్తారు. మరికొన్ని సందర్భాల్లో పరువు కోసం బయటపడలేక వారిలో వారే మనోవేదనకు గురవుతారు. తాజాగా కిడ్నీ దానం చేసే వారికి రూ. 4 కోట్లు ఇస్తామంటూ ప్రముఖ ఆసుపత్రుల పేరుతో నకిలీ వెబ్ సైట్లు సృష్టించి సామాన్యులు మోసం చేస్తున్నారు. అలా మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు ఆఫ్రికా దేశీయులను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. అయితే వాళ్లు ఈ మోసం ఎలా చేశారు. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
బెంగళూరు సిటీ అదనపు పోలీస్ కమిషనర్ సుబ్రమణేశ్వర రావు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలో ప్రముఖ ఆసుపత్రుల పేర్లతో నకిలీ వెబ్ సైట్లు సృష్టించారు. వాటిని వాట్సప్ ఖాతాలను రూపొందించి.. అందులో ఒక కిడ్నీ విరాళమిస్తే రూ.4 కోట్లు ఇస్తామని ప్రచారం చేశారు. ప్రముఖ ఆసుపత్రుల పేర్లతో ఉండడంతో నిజమేననుకుని చాలామంది వారిని సంప్రదించారు. అందుకు ముందుగా కొంత రుసుము చెల్లించాలని వారు సూచించారు. రూ.4 కోట్లు వస్తున్నాయి కదా అని నమ్మి వాళ్లు అడిన రసుము చెల్లించారు. అలా సామాన్యుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేశారు.
ఈక్రమంలో మోసపోయామని తెలిసిన చాలా మంది బాధితులు ఎవరు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఫిర్యాదు చేస్తే తమకే ఇబ్బంది అని మిన్నకుండిపోయారు. అయితే ఆసుపత్రుల నుంచి ఫిర్యాదులు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా పక్క సమాచారం అందుకుని అమృతహళ్లి అపార్టుమెంట్‌పై దాడి చేసి ముగ్గురినీ అరెస్టు చేశారు. ఘనా దేశానికి చెందిన మిని మిరాకల్, నైజీరియాకు చెందిన కోవా కూలింజ్, మ్యాథ్యూ ఇన్నోసెంట్ అనే ఈ ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా బాధితులు హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్ సీఈఎన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.