కాలు విరిగి, రక్తమోడుతున్న కొంగను ఓ వ్యక్తి కాపాడాడు. ఆ తరువాత ఆ కొంగతో స్నేహం చేశాడు. అయితే కొంగతో స్నేహం చేసిన సదరు వ్యక్తిపై అటవీ అధికారులు కేసు నమోదు చేశారు. అలానే ఆ పక్షిని వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించారు.
సమాజంలో సాటి మనిషిని ప్రేమించినట్లుగానే మూగజీవాలను ఇష్టపడే వారు ఉంటారు. వాటికి ఏదైనా ప్రమాదం జరిగితే తల్లడిల్లిపోతారు. కొందరు అయితే తమ ప్రాణాలకు తెగించి మరి.. ఆపదలో ఉన్న మూగజీవాలను కాపాడుతుంటారు. అనుకోని ప్రమాదాల్లో తీవ్ర గాయలైన వాటిని అక్కున చేర్చుకుని చికిత్స అందిస్తారు. అవి తిరిగి మాములు స్థితికి వచ్చే వరకు కంటికి రెప్పలా కాపాడుకుంటారు. తాజాగా ఓ వ్యక్తి కూడా కాలు విరిగి.. రక్తమోడుతూ ఉన్న కొంగను చేరదీశాడు. దానికి చికిత్స అందించి.. తిరిగి మాములు స్థితికి వచ్చేలా చేశాడు. అయితే కొంగను కాపాడిన సదరు వ్యక్తిపైనే పోలీసులు కేసు నమోదు చేశారు. మరి.. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉత్తర్ ప్రదేశ్ లోని ఆమేఠీ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఆరిఫ్ ఖాన్ కు సారస్ అనే కొంగకి మధ్య ఏర్పడిన అనుబంధం వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. ఏడాది క్రితం ఆరిఫ్ పొలంలో ఈ ‘సారస్’ కొంగ కనిపించింది. కాలు విరిగిపోయి, రక్తమోడుతూ ఉంది. దీంతో కొంగ ఏర్పడిన గాయాన్ని కడిగి కట్టు కట్టాడు. కొన్నాళ్లకు ఆ కొంగ కోలుకుని తిరిగి మాములు స్థితికి వచ్చింది. ఆ కొంగకు ఆరీఫ్ కి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. తనను కాపాడిన ఆరిఫ్ తోనే ఆ కొంగ ఉండిపోయింది.
యూపీ రాష్ట్ర పక్షి కొంగ అనే విషయం మనందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర పక్షిని సంరక్షించాలన్న ఉద్దేశంతో అటవీశాఖ అనేక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే అటవీ శాఖ అధికారులు మార్చి 21న ఆ కొంగను స్వాధీనం చేసుకుని రాయ్ బరేలీలో ని సమస్ పూర్ పక్షుల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ క్రమంలోనే తాజాగా అతనిపై కేసు కూడా నమోదు చేశారు. వాంగ్మూల నమోదుకు అటవీశాఖ కార్యాలయానికి రావాలని అధికారులు తెలిపారు. వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని పలు సెక్షన్ల కింద ఆరిఫ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. స్టేట్ మెంట్ రికార్డు చేసేందుకుగాను గౌరీగంజ్ డివిజనల్ అటవీశాఖ అధికారి కార్యాలయానికి రావాలని నోటీసులు జారీ చేశారు.
అయితే కొంగను కాపాడిన వ్యక్తిపై కేసు నమోదు చేయడంపై ప్రతిపక్ష నేత, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ అగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఆరిఫ్ అంగీకారంతోనే పక్షిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్పారు. ఈ జాతి పక్షులు ఎప్పుడు జంటగా జీవిస్తాయని, ఈ కొంగ ఒంటరిగా నివసిస్తున్న నేపథ్యంలోనే దాని మేలుకే సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.