ఈ భూమి మీద అత్యంత విలువైనది తల్లి ప్రేమ. ఎందుకంటే.. ఏ స్వార్థం లేకుండా తన బిడ్డలను పెంచి పెద్ద చేస్తుంది. తల్లి నవమాసాలు మోసి ..తన ప్రాణాలను పణంగా పెట్టి బిడ్డకు జన్మనిస్తుంది. తాజాగా అలా ఓ గర్భిణికి ప్రసవించి బిడ్డను బకెట్ లో వదిలేసింది.
ఈ భూమి మీద అత్యంత విలువైనది తల్లి ప్రేమ. ఎందుకంటే.. ఏ స్వార్థం లేకుండా తన బిడ్డలను పెంచి పెద్ద చేస్తుంది. తల్లి నవమాసాలు మోసి ..తన ప్రాణాలను పణంగా పెట్టి బిడ్డకు జన్మనిస్తుంది. ఆ ప్రసవం సమయంలో ఆ తల్లి ఎంత నరకం అనుభవిస్తుందో మాట్లాలో చెప్పలేము. నేటికాలంలో అంటే ఆస్పత్రులకు తీసుకెళ్లి వైద్యుల పర్యవేక్షణలో గర్భిణీలకు ప్రసవం జరుగుతుంది. కానీ ఒకప్పుడు దాదాపు ఎక్కువ శాతం ఇంట్లోనే ప్రసవాలు చేసేవారు. అయితే నేటికి కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోనే ప్రసవం చేస్తున్నారు. తాజాగా అలా ఓ గర్భిణికి ప్రసవం చేయగా..ఆమె బిడ్డను బకెట్ లో వదిలేసింది. ఈ ఘోరమైన ఘటన కేరళలో చోటుచేసుకుంది.
మహిళకు ప్రసవం అనేది పునర్జన్మలాంటి. తన ప్రాణాలను ఫణంగా పెట్టి బిడ్డలకు జన్మనిస్తుంది. నేటికాలంలో చాలా వరకు అందరు ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల మాత్రం ఇళ్లలోని ప్రసవం జరుగుతుంది. తాజాగా కేరళలోని ఓ మహిళ కూడా తన బిడ్డకు ఇంట్లోనే జన్మనిచ్చింది. అయితే పుట్టిన బిడ్డ చనిపోయిందని బకెట్లో పడేసింది. కేరళ రాష్ట్రంలోని అలప్పుజా జిల్లాలోని చెంగనూర్ లో ఓ గర్భిణీ తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటుంది. నెలల నిండటంతో పురిటి నొప్పులు వచ్చాయి. చివరకు తన ఇంట్లోని బాత్ రూంలోనే ఆ మహిళ ప్రసవించింది.
అయితే ఆ బిడ్డలో ఎలాంటి చలనం లేదు. చాలా సేపు ప్రయత్నంచిన ఏమి స్పందన లేకపోవడంతో బిడ్డ చనిపోయినట్లు ఆ తల్లి భావించింది. చివరకు ఆ తల్లి పసిబిడ్డను బకెట్లో వదిలేసింది. ఆ తర్వాత ఆసుపత్రి వచ్చి వైద్యులకు ఈ విషయాన్ని తెలిపింది. దీంతో వైద్యులు పోలీసులకు సమాచారం అందిచారు. అనంతరం మహిళ ఇంటికి చేరుకున్నారు. పరీక్షించిన వైద్యులు శిశువు బతికే ఉన్నట్లు గుర్తించారు. బకెట్లో నుంచి ఆ బిడ్డను బయటకు తీసి ఆసుపత్రికి తీసుకొచ్చారు. చనిపోయిందనుకొని భావించిన తన బిడ్డ బతికే ఉండటంపై తల్లి,కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.