మహారాష్ట్రలో అనుమానస్పద బోట్ కలకలం రేపింది. రాయ్ గడ్ సమీపంలోని హరిహరేశ్వర తీరంలో అనుమానస్పద పడవను పోలీసులు గుర్తించారు. బోట్ లో ఏకే 47,బుల్లెట్లను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. పడవలో మరికొన్ని రకాల తుపాకులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇది ఉగ్రవాదుల పడవగా పోలీసులు అనుమానిస్తున్నారు. ముంబై తరహాలో దాడులకు తెగబడేందుకు ఉగ్రవాదులు చేసిన కుట్రగా పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసు అధికారులు రాయ్ గడ్ జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు. జిల్లా పోలీసులతో పాటు ఏటీఎస్ రంగంలోకి దిగింది. పోలీసులు పడవ దొరికిన ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడ విస్తృత తనిఖీలు చేపట్టారు. అనుమానస్పద బోట్ విషయంలో ఉగ్రవాదులు హస్తం ఉందేమో అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు మహారాష్ట్ర మంత్రి ఒకరు తెలిపారు. పోలీసులకు పట్టుబడ్డ ఈ స్పీడ్ బోట్ యూకేలో రిజిస్టర్ అయినట్లు గుర్తించారు.ఈ ఘటన గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.