ఓ విషయంపై సామాన్యులు నిరసనలు, ఆందోళనలు చేయడం సాధారణం. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తుంటారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులు ఆందోళనలు చేపట్టడం చాలా అరుదుగా జరుతుంటాయి. తాజాగా హైకోర్టుకు కొందరు న్యాయవాదులు నిప్పు పెట్టి ఆందోళనలు చేశారు. మధ్యప్రదేశ్ లోని జబల్ పుర్ హైకోర్టులో కేసు విచారణం వేళ అవమానకర వ్యాఖ్యలు చేశారని న్యాయవాది ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో సహచర లాయర్లు తీవ్రస్థాయిలో నిరసనగా దిగారు. కోర్టుకి నిప్పు పెట్టి విధ్వసం సృష్టించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ హైకోర్టులో అనురాగ్ సాహు అనే వ్యక్తి న్యాయవాది పనిచేస్తున్నారు. ఓ అత్యాచారం కేసులో బాధితుల తరపున ఆయన వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్ శుక్రవారం విచారణకి వచ్చింది. జస్టిస్ సంజయ్ ద్వివేది ధర్మాసనం వద్ద ఈ బెయిల్ పిటిషన్ విచారణ జరిగింది. విచారణ సమయంలో నిందితుడి తరపు న్యాయవాదికి, అనురాగ్ కి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్యాదం జరిగింది. చివరకు అది కాస్తా వ్యక్తిగత దూషణల వరకు వెళ్లింది. దీంతో ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో దూషించుకున్నారు. కొంత సమయం తరువాత అనురాగ్ హైకోర్టు నుంచి హడవుడిగా ఇంటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. అనురాగ్ సాహు మృతి విషయం తెలుసుకున్న తోటి న్యాయవాదులు కోపోద్రికులయ్యారు. అనురాగ్ మృతదేహాన్ని తీసుకుని నేరుగా హైకోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ ఆత్మహత్యకు కారకులైన వారిని శిక్షించాలని, ఈ కేసును సీబీఐ అప్పగించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు.
న్యాయదుల నిరసన కాసేపటికే హింసాయుతంగా మారింది. న్యాయవాదలు జస్టిస్ సంజయ్ ద్వివేది ఉన్న కోర్టు హాల్లోకి వెళ్లి.. విధ్వంసానికి పాల్పడ్డారు. అక్కడి వస్తువులకు నిప్పు పెట్టారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో భారీగా పోలీసులు న్యాయస్థానానికి చేరుకున్నారు. అయితే.. వారిని లాయర్లు అడ్డుకున్నారు. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది రాగా…వారిని సైతం అక్కడి న్యాయవాదులు అడ్డుకున్నారు. అలా చాలాసేపు ఎవరిని లోపలికి వెళ్లనివ్వలేదు. దీంతో పరిస్థితి అదుపుతుందని భావించిన పోలీసులు నిరసన కారులపై లాఠీ ఛార్జ్ చేశారు. అనంతరం కొద్ది సేపటికి పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. అయితే ఈ నిరసనలో పాల్గొన్న వారిలో చాలా మంది జిల్లా కోర్టుల్లో పనిచేసే న్యాయవాదులని అధికారులు తెలిపారు.