ప్రేమ అనే రెండు అక్షరాల ఈ పదం.. ఎప్పుడు, ఎలా, పుడుతుందో ఎవరికీ తెలియదు. ఇదే ప్రేమ ప్రాణాన్ని నిలబెడుతుందీ, ప్రాణాలను తీస్తుంది. ప్రేమించిన వ్యక్తి దక్కలేదని ఎంతో మంది యువత.. తమ నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రేమికులతో పాటు వారి చుట్టు ఉన్న వారు కూడా ఈ ప్రేమలకు బలవుతుంటారు. తాజాగా ఓ యువతి ప్రేమ విఫలం.. ముగ్గురి ప్రాణాలను తీసింది. మరో ముగ్గురు ప్రాణాలతో పోరాడేలా చేసింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
బిహార్ లోని ఔరంగాబాద్ జిల్లాలోని కస్మా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో కుటుంబంతో కలసి ఓ యువతి జీవనం సాగిస్తోంది. అన్న బావమరిదిని ఆ యువతి కొన్నాళ్లుగా ప్రేమిస్తోంది. ఈ క్రమంలో అతడికి తన ప్రేమ విషయం చెప్పాలని నిర్ణయించుకుంది. అన్న ద్వారా తన ప్రేమ విషయం ఆ యువకుడికి తెలియజేయలనుకుంది. కానీ అన్నకు చిన్నతనంగా ఉంటుందని భావించి.. ఆ ఆలోచన విరమించింది. తననే నేరుకు వెళ్లి ప్రేమ విషయం చెప్పమని ఆమె స్నేహితులు సలహ ఇచ్చారు.
ఈ క్రమంలో.. తన ఐదుగురు స్నేహితులతో కలిసి అతడి వద్దకు వెళ్లింది.ప్రేమిస్తున్నాని చెప్పి.. పెళ్లి చేసుకోవాలని కోరింది. దానికి అతడు.. ఇష్టం లేదంటూ తిరష్కరించాడు. దీంతో మనస్తాపం చెందిన యువతి అదేరోజు సాయంత్రం విషం మింగేసింది. ఏమైందో తెలియదు కానీ.. ఆమెతో పాటు ఉన్న ఐదుగురు స్నేహితులు కూడా అదే పని చేశారు. ఆరుగురికి నోటి వెంట నురుగు వచ్చింది. క్షణాల్లో అపస్మారక స్థితిలోకి వెళ్లారు.
ఆపస్మారక స్థితిలో ఉన్న వారిని గమనించిన స్థానికులు వెంటనే ఔరంగాబాద్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ప్రేమించిన యువతితో పాటు మరో ఇద్దరు అప్పటికే ప్రాణాలు కోల్పోగా.. మిగితా ముగ్గురి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.