అన్న అంటే అమ్మలో సగం, నాన్నలో సగం అని.. అక్క అంటే ఏకంగా తల్లే అంటారు మన పెద్దలు. అవును ఇంట్లో తొలిసంతానం.. తన వెనక జన్మించిన వారిపై తల్లిదండ్రుల మాదిరే ప్రేమనారాగాలు చూపిస్తారు. చెల్లి, తమ్ముడుకి మార్గదర్శకంగా ఉంటారు. ఇక మరీ ముఖ్యంగా అక్కకి తమ్ముడి మీద ఉండే అనురాగం గురించి ఎంత చెప్పినా తక్కువే. తమ్ముడిని సొంత కొడుకులా ప్రేమిస్తుంది అక్క. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు..
తమిళనాడులోని దిండిగల్ జిల్లాకు చెందిన ప్రియదర్శిని, పాండీదురై ఇద్దరు అక్కాతమ్ముళ్లు. చిన్నప్పటి నుంచి తమ్ముడు అంటే అక్క ప్రియదర్శినికి ప్రాణం. ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ. వారి ఆప్యాయతను చూసి విధికి కన్ను కుట్టుంది. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం యాక్సిడెంట్ రూపంలో పాండీదురైని మృత్యువు కబలించింది. పాండీదురై చనిపోయిన బాధ నుంచి ఆ కుటుంబం ఇంకా కోలుకోలేదు. ఈ క్రమంలో ప్రియదర్శిని కుమార్తెకి చెవులు కుట్టించే వేడుక నిర్వహించాలని నిర్ణయించారు కుటుంబ సభ్యులు. మేనమామే చెవులు కుట్టాలి. కానీ పాండీదురై మరణించాడు. దాంతో ప్రియదర్శిని ఓ అద్భుతమైన ఆలోచన చేసి.. మరణించిన తమ్ముడిని బతికించి తీసుకువచ్చింది. అదేలా సాధ్యం అంటే..
ఇది కూడా చదవండి: మరోసారి తెరపైకి జయలలిత వారసురాలి వివాదం!
మరణించిన పాండీదురై సిలికాన్ విగ్రహాన్ని తయారు చేయించింది ప్రియదర్శిని. దిండిగల్ జిల్లాలోని ఒట్టన్‌ఛత్రంలో కూతురి చెవులు కుట్టించే వేడుకను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసింది ప్రియదర్శిని. గుర్రపు జట్కా బండిపై తమ్ముడి విగ్రహాన్ని కూర్చొబెట్టి ఆట, పాటలు, కోలాటాల మధ్య ఊరేగింపుగా వేడుక జరిగే ప్రాంతానికి తీసుకువచ్చింది. ఊరంతా సంబరాలతో అంగరంగ వైభవంగా చెవులు కుట్టించే వేడుక నిర్వహించింది. ఈ వేడుకలో తమ్ముడు లేని లోటే లేకుండా చేసింది ప్రియదర్శిని. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో తెగ వైరలవుతోంది.
ఇది కూడా చదవండి: ఆ ఊరి రైతులు ఎక్కడా అప్పు చేయరు! లోన్ తీసుకోరు!
ఈ సందర్భంగా ప్రియదర్శిని మాట్లాడుతూ.. ‘‘మేనమామ హోదాలో నా తమ్ముడి ఒళ్ళో కూర్చోపెట్టి నా కూతురికి సంబంధించిన అన్ని వేడుకలు జరిపించాలని అనుకున్నాను. కానీ నా తమ్ముడు చనిపోవడంతో మేము పూర్తిగా విషాదంలోకి వెళ్ళిపోయాము. అలాంటి సమయంలోనే నాకు తనది సిలికాన్ విగ్రహం తయారు చేయించాలనే ఆలోచన వచ్చింది. ఆ విధంగా మా తమ్ముడిని మళ్ళీ మేము గుర్తు చేసుకుంటూ మా సంతోషాన్ని మా తమ్ముడితో పంచుకుంటున్నట్టే ఉంది’’ అని ఆమెతో పాటు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. తమ్ముడిపై ప్రియదర్శిని ప్రేమను చూసిన ప్రతి ఒక్కరు ఆమెను ప్రశంసిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ఒకప్పుడు ఆటో డ్రైవర్..ఇప్పుడు ఏకంగా మేయర్ అయ్యాడు!
TN Woman Celebrate Daughter Ear Piercing Ceremony With Brother Idol👏👏👏 pic.twitter.com/PhmuYSrjEH
— Ajay Suman Tv (@AjaySumanTv1) March 17, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.