పేరుకి అతడో ఐపీఎస్ అధికారి. అన్యాయాన్ని ఎదురించి బాధితుల పక్షాన నిలబడి న్యాయం చేయాల్సింది పోయి.. అదే జనాల పట్ల దారుణంగా వ్యవహరించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే?
అతడో ఐపీఎస్ అధికారి. ఉన్నత చదువులు చదివి మంచి హోదాలో స్థిరపడ్డాడు. అన్యాయాన్ని ఎదురించి బాధితుల పక్షాన నిలబడి న్యాయం చేస్తాడని ఎందరో అమాయక జనాలు నమ్మారు. కానీ, చివరికి ఎంతో నమ్మకం పెట్టుకున్న అదే జనాల పట్ల ఆ ఐపీఎస్ అధికారి క్రూరంగా వ్యవహరించి ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. తమిళనాడులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచనలంగా మారింది. అసలు ఆ ఐపీఎస్ అధికారి చేసిన దారుణం ఏంటి? అతడు ఎందుకు అలా చేశాడనే పూర్తి వివరాలు మీ కోసం.
తమిళనాడు తిరునల్వేలి జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బల్విర్ సింగ్. ఇతడు 2020 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. గత కొన్నేళ్ల నుంచి సేవలు అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. మార్చి 23 తిరునల్వేలి జిల్లాలోని అంబసముద్రంలోని జరిగిన ఓ కేసులో భాగంగా ఐదుగురు అనుమానితులను బల్వీర్ సింగ్ అదుపులోకి తీసుకున్నాడు. అయితే ఈ కేసు విచారణలో భాగంగా ఏఎస్పీ బల్వీర్ సింగ్ విచారణ పేరుతో అనుమానితులను చిత్ర హింసలకు గురి చేశాడు. కొత్తగా పెళ్లైన ఓ వ్యక్తి వృషణాలపై దాడి చేశాడు.
అంతేకాకుండా కటింగ్ ప్లేయర్ సాయంతో అతి దారుణంగా ఐదుగురి అనుమానితుల పళ్లను పీకాడు. అనంతరం కొన్ని రోజుల తర్వాత అనుమానితులు బెయిల్ పై విడుదలయ్యారు. ఇక అధికారి బల్వీర్ సింగ్ తమను చిత్ర హింసలకు గురి చేశాడని బాధితులు సోషల్ మీడియా ద్వారా అధికారి బల్వీర్ సింగ్ దారుణాలను సమాజం దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల ఈ వీడియో తమిళనాడు వ్యాప్తంగా వైరల్ గా మారి తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటన అంశంపై ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ స్పందించారు. ఇంతటి దారుణానికి పాల్పడిన బల్వీర్ సింగ్ ను వెంటనే సస్పెండ్ చేయాలంటూ ఆదేశాలు జారి చేశారు.
సీఎం అదేశాల మేరకు అధికారులు బల్వీర్ సింగ్ ను సస్పెండ్ చేశారు. ఈ దారుణ ఘటనపై మానవ హక్కుల సంఘాలు సైతం స్పందించాయి. రాక్షసుడిగా వ్యవహరించిన బల్వీర్ సింగ్ పై క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇకపోతే గతంలో బల్వీర్ సింగ్ పై అనేక ఆరోపణలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అనుమానితులపై ఇంతటి కిరాతకానికి పాల్పడిన ఐపీఎస్ అధికారి బల్వీర్ సింగ్ దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.