ఈ మధ్య కాలంలో అడవి జంతువులు మనుషులపై దాడి చేయటం బాగా పెరిగిపోయింది. పులులు, చిరుతలు, ఎలుగు బంట్లు ఇలా పలు రకాల జంతువులు జనారణ్యంలోకి వస్తున్నాయి. మనుషులపై దాడి చేసి చంపటమో లేదా గాయపర్చటమో చేస్తున్నాయి. అయితే! తాజాగా, చోటుచేసుకున్న ఓ సంఘటన ఇందుకు భిన్నమైనది. అడవిలో స్నేహితుల మందు పార్టీ ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఓ వ్యక్తిని పులి లాక్కెళ్లి చంపితింది. ఈ సంఘటన ఉత్తరాఖండ్‌లో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తరాఖండ్, డెహ్రాడూన్‌కు చెందిన అబ్దుల్ రషీద్ అనే వ్యక్తి తన ఇద్దరు స్నేహితులతో కలిసి శనివారం అడవికి వెళ్లాడు.
అక్కడ ముగ్గురు కలిసి మందు సిట్టింగ్ వేశారు. మందు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనుకోని ఓ సంఘటన జరిగింది. ఓ పులి అమాంతం వచ్చి ముగ్గురిపై దాడి చేసింది. అబ్దుల్ రషీద్‌ను తన పళ్లతో కరుచుకుని అడవి లోపలికి లాక్కుపోయింది. ఈ హఠాత్పరిణామంతో మిగిలిన ఇద్దరు అక్కడినుంచి పరుగులు తీశారు. అడవిలోంచి బయటపడి ఊర్లోకి వచ్చారు. అబ్దుల్ ఇంట్లో వాళ్లకు సమాచారం ఇచ్చారు. దీంతో అబ్దుల్ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అటవీ శాఖ అధికారుల సహాయంతో అడవిలో అబ్దుల్ కోసం గాలించారు.
ఏనుగు మీద కొన్ని గంటల పాటు గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం ఉదయం అబ్దుల్ కనిపించాడు. అయితే, పులి అతడ్ని చంపేసి సగం తినేసి ఉంది. అధికారులు శవాన్ని పోస్టుమార్టానికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం శవాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. కాగా, ప్రతీ ఏటా పదుల సంఖ్యలో జనం పులి బారిన పడి చనిపోతున్నారు. డిసెంబర్ 12 ఓ మతిస్థిమితం లేని వ్యక్తిని పులి అడవిలోకి లాక్కెళ్లి, చంపి తింది. మరి, అడవిలో మందు పార్టీ చేసుకుని ప్రాణాలు కోల్పోయిన అబ్దుల్ విషాదాంతంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#WATCH | #Uttarakhand : Search operation by forest team to find body of victim who was killed in tiget attack in Corbett pic.twitter.com/L2jkWUfe4v
— TOI Uttarakhand (@UttarakhandTOI) December 26, 2022