నేటి సమాజంలో చిన్న చిన్న కారణాలకు కొందరు వ్యక్తులు పగలు, ప్రతీకారాలు పెంచుకుంటున్నారు. ఇక అంతటితో ఆగక ఇంకొందరైతే ఏకంగా మనిషి ప్రాణాలను తీయాటానికి కూడా వెనకాడడం లేదు. ఇక అచ్చం ఇలాంటి చిన్న గొడవకే ఓ వ్యక్తి నిండు ప్రాణం బలైంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది యూపీలోని బరేలీలోని ఫతేగంజ్ ప్రాంతం. మార్చి 11న రాత్రి నంకు అనే వ్యక్తి తన ఇద్దరు స్నేహితులైన మోజిమ్ ఖాన్, మున్నాతో కలిసి ఢిల్లీ-లక్నో హైవేపై ఉన్న ఓ దాబా వద్దకు వెళ్లారు. ముగ్గురు కలిసి అదే దాబాలో రెండు కప్పుల టీ తాగారు. ఇక వెళ్లే క్రమంలో రెండు కప్పుల టీ డబ్బులు ఇవ్వడానికి దాబా యజమాని వద్దకు వెళ్లారు. బిల్లు రూ.20 అయిందని ఆ యజమాని వారికి చెప్పాడు. ఒకటి రూ.8 చొప్పున రూ.16 మాత్రమే అవుతాయని, రూ.20 ఎలా అవుతాయంటూ దాబా యజమానితో ముగ్గురు మిత్రులు వాగ్వాదానికి దిగారు.
దీంతో విసుగు చెందిన ఓ స్నేహితుడు రూ.20 ఇచ్చి బయటకు వచ్చారు. దాబా యజమానిపై కోపంతో ఉన్న ఆ ముగ్గురు మిత్రులు ఎలాగైన అతనిపై పగతీర్చుకోవాలనుకున్నారు. అనుకున్నట్లుగానే పథకం ప్రకారం మరుసటి రోజు మార్చి 12న రాత్రి ఆ ముగ్గురు యువకులు మళ్లీ అదే దాబాకు వెళ్లారు. దాబా యజమాని ఒక్కడే ఉండడంతో ఇదే సరైన సమయమని భావించారు.
అనుకున్నట్లుగానే ముగ్గురు మిత్రులు కత్తులతో పొడిచి అతి కిరాతకంగా దాబా యజమానిని హత్య చేసి పరారయ్యారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులైన నంకు, మోజిమ్ ఖాన్, మున్నాలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.