చాలా మంది రైళ్లలో ప్రయాణం చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే అప్పడప్పుడు జరిగే రైలు ప్రమాదాలు భయాందోళన కలిగిస్తుంటాయి. ఇప్పటికే అనేక రైలు ప్రమాదాలు చోటుచేసుకోగా..తాజాగా ముంబై సమీపంలో ఓ రైలు ప్రమాదం జరిగింది.
రైలులో ప్రయాణం చేయడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. ధర తక్కువతో పాటు ప్రయాణం ఎంతో ఆహ్లాదకరగా ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. అలానే సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు రైళ్లో ప్రయాణించేందుకే ఇష్టపడుతుంటారు. అయితే అప్పుడప్పుడు రైలు ప్రమాదాలకు గురవుతుంటాయి. ఈ ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు గాయాల పాలవుతుంటారు. తాజాగా ముంబై సమీపంలో ఓ లోకల్ ట్రైన్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో సబర్బన్ రైలులోని మూడు బోగీలు పట్టాలు తప్పాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
మహారాష్ట్రలోని ముంబై నగరంలో సబర్బన్ లోకల్ రైలు బేలాపూర్ నుంచి ఖార్కోపర్ కు వెళ్తుండుగా మంగళవారం ఉదయం 8.45 గంటలకు ప్రమాదానికి గురైంది. ఖార్కోపర్ రైల్వే స్టేషన్ కి సమీపంలో సబర్బన్ రైలు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మూడు బోగీలు పట్టాలు తప్పాయి. రైలు పట్టాలు తప్పడంతో అటుగా వెళ్లే రైళ్లు తాత్కాలికంగా నిలిచిపోయాయని, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటన నవీ ముంబై పరిధిలోని బేలాపూర్, ఖార్పోకర్ లైన్‌లో జరిగింది.
రైలు ప్రమాదానికి గురైన ఖార్కోపర్ స్టేషన్ ప్రాంతం ముంబైకి 30 కిలో మీటర్ల దూరంలో ఉంది. రైలు ఇంజన్ వైపు ఉండే మూడు కోచ్‌లు పట్టాలు తప్పాయి. పన్వెల్ , బేలాపూర్ ఇతర ప్రాంతాల నుండి వచ్చే పలు రైళ్లు ఈ ఘటన స్థలం సమీపంలో చేరుకుని ఆగిపోయాయి. రైలు ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అంతేకాక పట్టాలు తప్పిన బోగీలను తొలగిస్తూ ఇతర రైళ్లకు లైన్ క్లియర్ చేస్తున్నారు. ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో బేలాపూర్ – ఖార్కోపర్ – నెరుల్ మార్గంలో రైళ్లు నడవడం లేదు.
3 coaches of Belapur to Kharkopar local train derailed while entering in Kharkopar station. Time 8.46am.
There’s no injury to any passengers
Relief trains have left for the site for restoration.
Repercussions: Trains on Belapur – Kharkopar – Nerul line are not running.
— Shivaji M Sutar (@ShivajiIRTS) February 28, 2023
ఈ ఘటనపై సెంట్రల్ రైల్వే అధికారి శివాజీ ఎం సుతార్ మాట్లాడుతూ..”బేలాపూర్ నుంచి బయలు దేరిన ఖార్కోపర్ లోకల్ రైలు ఖార్కోపర్ స్టేషన్‌లోకి ప్రవేశిస్తుండగా మూడు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం, గాయాలు కాలేదు. ఘటనా స్థలానికి సహయక బృందం చేరుకుని రైళ్ల పునరుద్ధరణకు కోసం యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నారు. పట్టాలు తప్పిన బోగీలను, దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌లలో కొంత భాగాన్ని వేరు చేసి, వాటిని మార్చాల్సిన అవసరం ఉంది” అని ఆధికారి తెలిపారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
3 coaches of #Belapur to #Kharkopar local train derailed while entering in Kharkopar station. Relief trains have left for the site for restoration. Trains on Belapur – Kharkopar – Nerul line are not running.#Mumbailocal #NerulLine #Trainderail pic.twitter.com/HmTq454S5D
— India.com (@indiacom) February 28, 2023