ప్రజలను ఆకర్షించడానికి పలు కంపెనీలు, షాపింగ్ మాల్స్, హోటళ్లు.. రక రకాల ఆఫర్లు పెడుతుంటారు. జనాలకు ఏవైనా షాపుల వాళ్లు బంపర్ ఆఫర్లు ప్రకటించారంటే చాలు.. ఆ షాపుల ముందు క్యూ కడతారు. పనులన్నీ మానుకొని అక్కడ ప్రత్యక్షమవుతారు. ఓ షాపింగ్ మాల్ భారీగా ఆఫర్ ప్రకటించగానే.. కస్టమర్ల తాకిడి కూడా ఊహించని రీతిలో ఎక్కువైంది. ఒకనొక దశలో సిబ్బంది ఏం చేయలేక చేతులెత్తేసింది కూడా. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.
తిరువతపురంలోని ‘లులూ’ షాపింగ్ మాల్ అన్ని ఉత్పత్తులపై 50 శాతం భారీ డిస్కౌంట్ ప్రకటించింది. అంతే ఒక్కసారిగా జనాలు తండోపతండాలుగా ఎగబడ్డారు. దీంతో ఆ మాల్ సిబ్బంది ఆ జనాలను నియంత్రించ లేక ఒకానొక దశలో చేతులెత్తేసింది. దీనికి సంధించిన ఫుటేజ్ జూలై 6 అర్ధరాత్రి నుంచి రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో తెగ హల్ చల్ చేస్తుంది. ఈ వీడియో వీక్షించిన నెటిజన్ల్ రక రకాలుగా స్పందిస్తున్నారు.
ఇంత భారీ రద్దీ ఉన్నా, తొక్కిసలాట చోటుచేసుకోకపోవడం అద్భుతమంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు. ఎందుకలా ఎగబడటం అని కొందరూ, బహశా షాపు ప్రారంభం కావచ్చు అని మరోకరు కామెంట్లు చేస్తూ ట్వీట్ చేశారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది చదవండి: వామ్మో.. ఈ మేక ధర రూ.70 లక్షలు.. ప్రత్యేకత ఏంటో తెలుసా?
Thread on some videos from #Lulumall, cochin !!
Looked like the entire Kochi was in the mall. Reminded me of Saravana stores, chennaipic.twitter.com/AscmYHFljM
— Vineeth K (@DealsDhamaka) July 8, 2022
— Vineeth K (@DealsDhamaka) July 8, 2022