ఏటీఎంలో దొంగతనాలు చేయడం కొత్తేమి కాదు. గతంలో ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. ఏటీఎంని బద్దలు కొట్టి లక్షలు కాజేసిన ఘరానా దొంగలు ఉన్నారు. ఏటీఎం దొంగతనానికి ప్రయత్నించి వల్ల కాక వెనుతిరిగిన వారు ఉన్నారు. కానీ.., జేసీబీ సాయంతో ఏకంగా ఏటీఎంని ఎత్తుకెళ్తే? వినడానికే ఆశ్చర్యంగా ఉందా? అవును.. మహారాష్ట్రలోని సాంగ్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ వివరాలోకి వెళ్తే..మహారాష్ట్రలోని సాంగ్లీ ప్రాంతం అంతా ఘరానా దొంగలకి ఫేమస్. దొంగతనం చేసింది ఎవరో తెలిసినా కూడా వారిని పోలీసులు అరెస్ట్ చేయలేని పరిస్థితితులు అక్కడ ఉన్నాయి. మరి.. ఇంత స్దానబలం ఉన్న కేటుగాళ్లు ఖాళీగా ఎందుకు ఉంటారు. ఏకంగా ఓ జేసీబీ వేసుకొచ్చి..మిరాజ్ ప్రాంతంలో ఉండే యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం ని అమాంతం ఎత్తుకెళ్లిపోయారు.
శనివారం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దొంగలు ఏటీఎం లోకి ఎంటర్ అవ్వడం. ఆ తరువాత జేసీబీ సాయంతో ఏటీఎంని లిఫ్ట్ చేసి అమాంతం ఎత్తుకెళ్ళడం అంతా సీసీటీవీలో స్పష్టంగా రికార్డు అయ్యాయి. ఇక సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా స్థానిక పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. అయితే.. ఆ ప్రాంతంలో దొంగలు ఇలా బరి తెగించడంపై స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఇలా జేసీబీ సాయంతో.. ఏటీఎంని ఎత్తుకెళ్ళడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.