ప్రపంచంలో సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో వింతలు విశేషాలు చూసే అవకాశం సామాన్య ప్రజలకు దక్కుతుంది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ప్రపంచం మన గుప్పిట్లో ఉన్నట్టే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ప్రతి ఒక్కరూ ఎంతో యాక్టీవ్ గా ఉంటారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్స్ అధ్యక్షుడు ఆనంద్ మహేంద్రా అంటే తెలియని వారు ఉండరు.
వ్యాపార రంగంలో ఆనంద్ మహీంద్రా ఎంత బిజీ షెడ్యూల్ లో ఉన్నప్పటికీ సోషల్ మీడీయాలో మాత్రం యాక్టీవ్ గా ఉంటారు. ప్రపంచంలో జరిగే ఎన్నో వింతలూ.. విశేషాలుతో పాటు సృజనాత్మక వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. ఎంతో మంది ఔత్సాహిక కళాకారులను.. టాలెంట్ ఉండి పేదరికంతో ఉన్నవారికి అండగా నిలుస్తున్నారు. తాజాగా ఆనంద్ మహీంద్రా ఓ అద్బుత కళాకండానికి సంబంధించిన వీడియోని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.. ఇప్పుడు ఇది వైరల్ గా మారింది.
మనిషి సృజనాత్మకత, కళా నైపుణ్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. మనిషి శరీర అవయవాలపై జంతువులు, పక్షుల ఆకారాల్లో తమ శరీరాన్ని వంపు చేసి ప్రదర్శించే కళను చూస్తే అచ్చం నిజమైన జంతువులు, పక్షులు అనే భ్రమ కలుగుతుంది. ఈ అద్భుత కళా నైపుణ్యం ఎనిమల్ బాడీ ఆర్ట్ గా ఎప్పటి నుంచో ప్రసిద్ది పొందింది. ఇటీవల ఓ టాలెంట్ షోలో కొంత మంది కళాకారులు ప్రకృతిలో పక్షులు, జంతువులకు సంబంధించిన విన్యాసాలు చేశారు.
ఈ టాలెంట్ షో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.. దీనిపై స్పందించిన ఆనంద్ మహీంద్రా ‘ఇది ఓ మహా అద్భుతం.. శుక్రవారం నేను నిజమైన అడవిలో ఉన్నట్టు అనిపించింది.. చివరి వరకు ఇది చూసి తీరాల్సిందే’ అంటూ క్యాప్షన్ పెట్టి ట్విట్ పోస్ట్ చేశారు. ఈ వీడియోలో పక్షులు, జంతువులు ప్రదర్శన ఎంతో అద్భుతంగా ఆకర్షించింది.. ముఖ్యంగా చివరల్లో కొంతమంది కళాకారులు పెద్ద పులిలా కనిపించిన దృశ్యం రెండు కన్నులు చాలవు అన్నతీరుగా ఉంది. ఈ వీడియో ఇప్పటికే నాలుగు లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
Fantastic. #Friday in the Forest. Wait for the last one… pic.twitter.com/puTdrKTlMW
— anand mahindra (@anandmahindra) December 9, 2022
https://publish.twitter.com/?query=https%3A%2F%2Ftwitter.com%2Fanandmahindra%2Fstatus%2F1601033820907589632&widget=Tweet