టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేసే వారు చాలా మందే ఉంటారు. అయితే టికెట్ కొని రైలు ఎక్కని వారు ఎక్కడైనా ఉంటారా?. అవునూ మేము ఉన్నాము అని చెప్తున్నారు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఓ రైల్వేస్టేషన్ ప్రాంత వాసులు. మరి.. టికెట్ కొని వారు రైలు ఎందుకు ఎక్కడం లేదు.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం
సాధారణంగా చాలా మంది రైళ్లల్లో ప్రయాణం చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఎందుకంటే రైలు ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు టికెట్ తీసుకుని రైళ్ల ప్రయాణం చేస్తుంటారు. అలానే కొందరు టికెట్ లేకుండానే రైళ్లలో ప్రయాణం చేస్తుంటారు. అయితే టికెట్ తీసుకుని కూడా ప్రయాణం చేయని మనుషులు ఉన్నారంటే మీరు నమ్ముతారా?. అవునండి.. అలాంటి వారు కూడా ఉన్నారు. రైలు టికెట్ తీసుకుంటారు.. కానీ రైలు మాత్రం ఎక్కరు. ఇలా రోజుల తరబడి టికెట్ తీసుకుంటూనే ఉంటారు. మరి.. ఆ రైల్వేస్టేషన్ పేరు ఏంటి? అక్కడి వారు ఎందుకు అలా చేస్తున్నారు. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్ రాజ్ సమీపంలో దయాల్ పుర్ రైల్వే స్టేషన్ ఉంది. దీనిని 1954లో సంవత్సరంలో నిర్మించారు. ఈ స్టేషన్ ప్రారంభమైన కొన్నాళ్ల తరువాత ప్రయాణికులు లేకపోవడంతో స్టేషన్ ఆదాయం తగ్గిపోయింది. దీంతో 2006లో ఈ స్టేషన్ ను రైల్వే అధికారులు మూసేశారు. తమ గ్రామంలో రైల్వే స్టేషన్ ఉందని సంబరం పడిన స్థానికులకు.. కేంద్రం తీసుకున్న నిర్ణయం చాలా బాధనిపించింది. తమ గ్రామంలో రైల్వే స్టేషన్ ను పునః ప్రారంభించాలని దయాల్ పుర్ ప్రజలు కొన్నేళ్ల పాటు పోరాటం చేశారు. వారు ఎన్నో ఏళ్లు పోరాటం చేస్తే.. వారి కృషి ఫలించి.. 2022 జనవరిలో అధికారులు దయాల్ పుర్ స్టేషన్ ను తిరిగి ప్రారంభించారు.
కొన్నాళ్ల పాటు జనాలు బాగానే ఈ స్టేషన్ నుంచి ప్రయాణం చేశారు. అలానే టికెట్లు కూడా బాగానే అమ్ముడుపోయాయి. దీంతో ఆ ప్రాంత వాసులు సంతోషంలో మునిగి తేలారు. అయితే వారి సంతోషం ఎంతో కాలం నిలబడలేదు… కొన్నాళ్ల మళ్లీ అమ్మకాలు భారీగా పడిపోయాయి. ఈ క్రమంలో స్థానిక ప్రజలందరిలో ఓ ఆందోళన కలిగింది. ఇన్నేళ్లు కష్టపడి.. తిరిగి తెరిపించుకున్న రైల్వే స్టేషన్ మళ్లీ మూతపడితే.. ఎలా అనే సందేహం గ్రామస్థులో ఏర్పడింది. దీంతో వారిలో ఓ ఆలోచన కలిగింది. ఆదాయం తగ్గి స్టేషన్ మూతపడకుండా ఉండేందుకు గ్రామస్థులు రైల్లో ప్రయాణం చేయకపోయినా టికెట్లుకొంటున్నారు.
అలా.. గతేడాది డిసెంబర్ వరకు నెలకు సుమారు 700 టికెట్లు స్థానికులు కొనుగోలు చేశారు. కానీ ఈ ఏడాది ప్రారంభం నుంచి టికెట్ల అమ్మకాలు మళ్లీ పడిపోయాయి. దీన్ని గమనించిన గ్రామస్థులు ఇప్పుడు తిరిగి పెద్ద సంఖ్యలో రైలు టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. ఇలా స్టేషన్ ఆదాయం తగ్గినప్పుడల్లా తాము టికెట్లు కొని.. స్టేషన్ మూతపడకుండా చూసుకుంటామని గ్రామస్థులు చెబుతున్నారు. మరి.. స్టేషన్ ను కాపాడుకునేందుకు ఈ గ్రామస్థులు చేస్తున్న ప్రయత్నంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.