తల్లిదండ్రుల ఒత్తిడికే లేదా డబ్బులకు ఆశపడి వివాహలు చేసుకుని, వారితో కొన్నిరోజులు కాపురం చేశాక చివరికీ మోహం చాటేస్తున్నారు. అప్పటికీ ఆమె చేతిలో ఒకరో, ఇద్దరు బిడ్డలు ఉంటున్నారు. భర్త మరో పెళ్లి చేసుకుని ఈమెను వదిలించుకునే ప్రయత్నాల్లో ఉంటాడు. అయితే ఓమహిళ మాత్రం..
కాసుల కక్కుర్తిలో పడి మానవ సంబంధాలకు తిలోదకాలు ఇస్తున్నారు కొంత మంది మూర్ఖులు. ఎంతో అపురూపంగా పెంచి పెద్ద చేసిన కుమార్తెకు పెళ్లి చేసి అల్లుడి చేతిలో పెడుతుంటే.. ఆమెకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాడు. తల్లిదండ్రుల ఒత్తిడికే లేదా డబ్బులకు ఆశపడి వివాహలు చేసుకుని, వారితో కొన్నిరోజులు కాపురం చేశాక చివరికీ మోహం చాటేస్తున్నారు. అప్పటికీ ఆమె చేతిలో ఒకరో, ఇద్దరు బిడ్డలు ఉంటున్నారు. భర్త మరో పెళ్లి చేసుకుని ఈమెను వదిలించుకునే ప్రయత్నాల్లో ఉంటాడు. ఇది తెలియన భార్య.. భర్త సర్వస్వమనుకుని..తనను వదిలేసి వెళ్లిపోయాడన్న బాధతో అఘాయిత్యాలకు ఒడిగడుతుంది. కానీ ఈ మహిళ తనకు న్యాయం చేయాలంటూ కలెక్టర్ కార్యాలయం మెట్టేక్కింది.
డబ్బు మోజులో మొదటి భార్య ఉండగానే.. రహస్యంగా రెండో వివాహం చేసుకున్న భర్తపై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసనకు దిగింది ఓ మహిళ. ఈ ఘటన తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. పెద్దపాళ్యం సమీపంలోని వండిమేట్టు గ్రామానికి చెందిన మారియమ్మాల్.. తండలం గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తిని ప్రేమించి 2007వ సంవత్సరంలో పెళ్లి చేసుకుంది. వీరికి ఓ బాబు ఉన్నాడు. గత కొద్ది నెలల కిందట భార్యభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీన్నే సాకుగా భావించిన రమేష్ మొదటి భార్యకు తెలియకుండా తండలం గ్రామానికి చెందిన ఓ మహిళను రెండవ వివాహం చేసుకుని కాపురం పెట్టేశాడు. విషయం తెలుసుకున్న మారియమ్మాల్ నేరుగా రమేష్ ఇంటికి వెళ్లి నిలదీయగా, దాడి చేసి గాయపరిచారు
తాము పెళ్లి చేసుకున్నామని, ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానని బెదిరించడంతో మనస్తాపం చెందిన మహిళ సోమవారం బాబుతో కలిసి కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని ఆందోళన చేపట్టింది. తాను బతికి ఉండగానే రెండవ వివాహం చేసుకున్న భర్తపై చర్యలు తీసుకోవడంతో పాటు తమకు న్యాయం చేయాలని కోరుతూ నినాదాలు చేసింది. దీంతో కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని మహిళను స్టేషన్‌కు తరలించారు. ఆమె ఫిర్యాదును స్వీకరించి న్యాయం చేస్తామని హమీ ఇవ్వడంతో ఆందోళన విరమించింది.