ఒకపక్క టెక్నాలజీ యుగం పరుగులు తీస్తుంటే.., మరోపక్క కొన్ని మారుమూల గ్రామాల్లోని కొందరు కుల పెద్దలు కట్టుబాట్ల పేరుతో దారుణాలకు తెగబడుతున్నారు. ఇక నిబంధనలు పాటించకుంటే శిక్షలు కఠినంగా ఉంటాయని గ్రామ పెద్దలు హెచ్చరిస్తున్నారు. అచ్చం ఇలాంటి కులం కట్టుబాట్ల పేరుతో రాజస్థాన్ లోని ఓ జిల్లాలోని కొందరు గ్రామ పెద్దలు ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడుతున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు ఈ ఘటనలో ఏం జరిగిందో తెలియాంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
రాజస్థాన్ లో బిల్వారా జిల్లాలో కొన్ని గ్రామాల్లో కుల పెద్దలు కులం కట్టుబాట్ల పేరుతో కిరాతకానికి పాల్పడుతున్నారు. గ్రామంలోని ఎవరైన తీసుకున్న అప్పు సమయానికి తిరిగి చెల్లించాలి, లేకుంటే 8-18 ఏళ్ల వయసున్న కూతుళ్లను స్టాంప్ పేపర్లపై వేలానికి అంగీకరించాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. అయితే సమయానికి అప్పులు చెల్లించలేని అనేక మంది కూతుళ్లను స్టాంప్ పేపర్లపై వేలం వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలా వేలం వేసిన అనేక మంది యువతులను వ్యభిచారంలోకి దించడంతో పాటు మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, ముంబై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాలకు తరలిస్తున్నట్లు సమచారం. ఇలా కూతుళ్ల వేలానికి సహకరించని అనేక మంది తల్లులను కుల పెద్దలు అత్యాచారం చేసి.. ఆ తర్వాత బానిసలుగా ఉంచుకుంటున్నారట.
దీనికి సంబంధించిన స్టాంప్ పేపర్లు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పాటు జాతీయ మీడియాల్లో కథనాలుగా వెలువడ్డాయి. ఈ వార్తలపై వెంటనే స్పందించిన రాజస్థాన్ మహిళా కమిషన్ డీజీపీతో పాటు బిల్వారా జిల్లా కలెక్టర్ లకు నోటీసులు పంపింది. నిజనిర్ధారణ కమిటీ రిపోర్టులను వారం రోజుల్లోగా పంపాలని కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదే అంశంపై జాతీయ మానవ హక్కల కమిషన్ సైతం తాజాగా స్పందించి రాజస్థాన్ ప్రభుత్వానికి నోటీసులు పంపింది. ఈ క్రమంలోనే ఎన్సీడబ్ల్యూ ఇద్దరు సభ్యులతో కూడిన ఓ కమిటీని కూడా వేసినట్లు తెలుస్తోంది. దీనిపై రాష్ట్ర మంత్రులు సైతం స్పందించి సీరియస్ అయ్యారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ఘటనపై ముందు ముందు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారుతోంది.
Caste panchayat in Bhilwara, Rajasthan is making girls slaves; Girls are sold on stamp paper, mother is raped if not sold pic.twitter.com/XXJK8IJpb3
— Rituraj (@ItinerantMedic) October 27, 2022