దొంగలు ఎంతో ప్రణాళికతో ఇళ్లల్లో, దుకాణాల్లో విలువైన వస్తువులు చోరీ చేస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో దొంగలు అనుకోని చిక్కుల్లో పడుతుంటారు. మరికొందరు దొంగతనం చేసి తప్పించుకునే ప్రయత్నంలో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ దొంగ కూడా అలాంటి చిక్కుల్లో పడ్డాడు.
దొంగలు ఎంతో ప్రణాళికతో ఇళ్లల్లో, దుకాణాల్లో విలువైన వస్తువులు చోరీ చేస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో దొంగలు అనుకోని చిక్కుల్లో పడుతుంటారు. మరికొందరు దొంగతనం చేసి తప్పించుకునే ప్రయత్నంలో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ దొంగ కూడా రోడ్డు మీద వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాగేశారు. దానిని మింగేసి.. చివరకు కాపాడంటూ పోలీసులను వేడుకున్నాడు. ఈ ఘటన జార్ఖండ్ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో సల్మాన్, జాఫర్ అనే ఇద్దరు దొంగలు ఉన్నారు. ఈ ఇద్దరు స్థానికంగా ఇళ్లల్లో, షాపుల్లో దొంగతనాలు చేస్తుంటారు. అలానే ఒంటరిగా ఉండే మహిళ, ఆడపిల్లల వద్ద విలువైన వస్తువులు చోరి చేసే వారు. ఇటీవలే రాంచీ సమీపంలోని దిబ్దిహ్ వంతెన వద్ద రోడ్డు మీద వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాగేశారు. వెంటనే అప్రమత్తమైన బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. దీంతో బైక్ మీద పారిపోతున్న దొంగలను పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. తాము దొంగతనం చేయలేదని తప్పించుకునేందుకు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో చోరీ చేసిన బంగారు గొలుసును సల్మాన్ మింగేశాడు. కాసేపటికి అతడు స్పహ తప్పి పడిపోయాడు.
దీంతో పోలీసులు వెంటనే అతణ్ని రాంచీలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. నిందితుడి పరీక్షించిలో ఛాతీ భాగంలో బంగారు గొలుసు ఇరుక్కుపోయినట్లు గుర్తించారు. గొలుసు.. ఎక్కువసేపు అలాగే ఉంటే ఇన్‌ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. దీంతో తనను కాపాడాలని సల్మాన్ పోలీసులను వేడుకొంటున్నాడు. రాంచీలో ఒంటరిగా వెళ్తున్న మహిళలే లక్ష్యంగా సల్మాన్, జాఫర్ పలు చోరీలకు పాల్పడ్డారు. నిందితులు దొంగతనానికి వాడిన బైక్ కూడా చోరీ చేసిందే. ప్రస్తుతం వీరిద్దని అదుపులోకి తీసుకుని చోరీ చేసిన వస్తువులు రికవరీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి.. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో దొంగ చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.