వ్యవసాయం మీదనే కాకుండా పశు సంపద మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు అనేకం ఈ దేశంలో ఉన్నాయి. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు వంటి జంతువుల నుండి వచ్చే పాలు, మాంసాన్ని విక్రయించి ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు.
వ్యవసాయం మీదనే కాకుండా పశు సంపద మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు అనేకం ఈ దేశంలో ఉన్నాయి. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు వంటి పశు జాతికి చెందిన వాటి నుండి వచ్చే పాలు, మాంసాన్ని విక్రయించి ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. అలాగే రకాన్ని బట్టి ఈ పశువులకు డిమాండ్. మేలిమి జాతికి చెందినవి ఎక్కువ పాలు ఇస్తాయి కాబట్టి.. మార్కెట్‌లో వాటి కంటూ ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అలాగే సైజు, బరువును బట్టి మేకలు, గొర్రెలను మాంసం, చర్మం, ఊలు నిమిత్తం విక్రయిస్తుంటారు. వీటి ధర వేల నుండి లక్షల వరకు పలుకుతుంది. అయితే ఓ గొర్రె మాత్రం ఏకంగా కోటి రూపాయలు పలుకుతూ ఆశ్చర్యపరుస్తుంది. ఇంతకు ఇది ఎక్కడ ఉందంటే..
రాజస్థాన్ చురు జిల్లాకు చెందిన రాజు సింగ్ అనే వ్యక్తి దగ్గర ఉంది ఈ గొర్రె. తన గొర్రెల మందంలోని ఓ గొర్రెకు కోటి రూపాయలు ఇస్తామని వస్తున్నా.. ససేమీరా అంటున్నారు రాజు సింగ్. ఇంతకు ఆ గొర్రెకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. ఈ గొర్రె పొట్ట భాగంలో ఉర్దూ భాషలో 786 ఆకారం ఉందిట. గత ఏడాది పుట్టిన ఈ గొర్రెపిల్ల.. పెరుగుతున్న క్రమంలో ఉర్దూ భాషలో ఏదో ఆకారం రావడాన్ని గమనించాడు. అయితే తొలుత ఏంటో అర్థం కాలేదు. చివరికీ తన గ్రామంలో ఉన్నముస్లింలకు చూపించగా.. అది ఉర్దూ భాషలో 786 సంఖ్య అని చెప్పారట. ముస్లింలకు ఆ నంబర్ దేవుడి సంఖ్యగా భావిస్తారు. ఈ విషయం తెలిసి కొనేందుకు రాజు దగ్గరకు వస్తుండగా.. దేవుని ఆశీస్సులున్నగొర్రె పిల్ల అన్నకారణంగా దాన్ని అమ్మేందుకు నిరాకరిస్తున్నారట. అప్పటి నుండి దాని మరింతగా జాగ్రత్తగా చూసుకుంటున్నారట. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది.