భారత దేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని అనుసరిస్తుంది. హిందూ, ముస్లిం భాయ్, భాయ్ అంటూ ఆపాయ్యత కనబర్చుకుంటున్నారు. ఒక తల్లికి పుట్టిన బిడ్డల్లాగా సాయం చేసుకుంటున్నారు. కానీ ఓర్వలేని కొన్ని పచ్చ కళ్లు.. కులాలు, మతాల మధ్య కుంపటి రాజేసి, దాని నుండి చలి కాల్చుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి.
స్వార్థ రాజకీయ, స్వలబ్ధి కోసం కొంత మంది మత కల్లోలాలను సృష్టించడం దేశంలో పరిపాటిగా మారిపోయింది. అన్ని మతాలకు చెందిన వారు వసుదైక కుటుంబంగా జీవిస్తున్నారు. భిన్నత్వంలో ఏకత్వంగా బతుకుతున్నారు. హిందూ, ముస్లిం భాయ్, భాయ్ పలకరించుకుంటూ ఆపాయ్యత కనబర్చుకుంటున్నారు. ఒక తల్లికి పుట్టిన బిడ్డల్లాగా సాయం చేసుకుంటున్నారు. కానీ ఓర్వలేని కొన్ని పచ్చ కళ్లు.. కులాలు, మతాల మధ్య కుంపటి రాజేసి, దాని నుండి చలి కాల్చుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి. ముఖ్యంగా నేటి రాజకీయాలన్నీ వీటి మధ్యే తిరుగుతున్నాయి. వీటి తోడు ఆదర్శంగా నిలిచే వినోద రంగం సైతం.. మనుషులన్నీ మత మౌఢ్యంలోకి తోసే విధంగా సినిమాలు రూపొందించి.. వారిపైకి వదులుతున్నాయి.
కానీ మత సామరస్యాన్ని చాటుతూ కొంత మంది తామంతా మనుషులమేనని నిరూపిస్తున్నారు. అటువంటి ఘటనే ఇది. ఈ రోజుల్లో అయిన వారే ఆదరించడం లేదు.. కానీ ఓ హిందూ అమ్మాయిని.. ముస్లిం దంపతులు దత్తత తీసుకుని పెంచి పెద్ద చేసి హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిపించారు. ఈ ఘటన మరేక్కడో కాదూ.. ‘ది కేరళ స్టోరీ’ అంటూ ఏ రాష్టాన్ని ఉద్దేశించి సినిమా తీశారో.. అదే కేరళలో జరిగిందీ సంఘటన. వివరాల్లోకి వెళితే.. కేరళలోని కాసర్ గఢ్ ప్రాంతానికి చెందిన అబ్దుల్లా, ఖదీజా అనే మస్లిం దంపతులు నివసిస్తున్నారు. 10 ఏళ్ల వయస్సులో తల్లిదండ్రులు కోల్పోయిన రాజేశ్వరీని వీరు దత్తత తీసుకున్నారు. పెంచి పెద్ద చేశారు.
చివరకు ఆమెకు 22 ఏళ్లు రాగా, వరుడిని వెతికి.. హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేశారు. కేరళలోని భగవతి ఆలయంలో రాజేశ్వరి పెళ్లి చేసిన అబ్దుల్లా, ఖదీజా.. దానికి హిందూ, ముస్లింలను ఆహ్వానించారు.హిందూ, ముస్లింలకు చెందిన కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో విష్ణు ప్రసాద్‌తో రాజేశ్వరి వివాహం జరిగింది. ఈ పెళ్లి వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చాలా మంది ఈ పెళ్లిపై స్పందించారు. ఎన్సీపీ నేత జితేంద్ర అవ్హాద్ ట్విటర్‌లో దీనికి సంబంధించిన పోస్టు చేసి.. దాని వెనుక జరిగిన కథను వివరించారు. ‘దీన్ని చిత్రీకరించే సత్తా ఉందా? నెగెటివ్ విషయాలు మాత్రమే చూపిస్తూ.. మతకల్లోలాను సృష్టించేందుకు 100 శాతం ప్రయత్నాలు జరుగుతున్నాయి’అంటూ ట్వీట్ చేశారు.
కాగా, మరికొంత ‘ది కేరళ స్టోరీస్’ అంటే ఇది డైరెక్టర్ గారు మీరు చేయవలసిన సినిమా ఇది అని ట్వీట్ చేశారు. సెక్యులర్ భారతదేశానికి ఉదాహరణ అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశారు.కాగా, ఈ పెళ్లి రెండేళ్ల క్రితం జరగ్గా.. ‘ది కేరళ స్టోరీ’ సినిమా కారణంగా ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటువంటి ఓ వీడియోను మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ షేర్ చేశారు. ‘ది కేరళ స్టోరీ’ సినిమాలో చూపించినట్టు కేరళలో పరిస్థితులు లేవని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. అదంతా కట్టుకథే అని చాలా మంది భావిస్తున్నారు. అయితే.. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. సినిమాలో.. కేరళలోని కాసర్‌గోడ్ పట్టణం ప్రస్తావన వస్తుంది. ఆదా శర్మ ఆ పట్టణంలోనే నర్సింగ్ చదవడానికి వస్తుంది.
केरळमधील कासरगोड येथील अब्दुल्ला आणि त्याची पत्नी खदिजा यांनी 10 वर्षांच्या हिंदू मुलीला दत्तक घेतले जिने तिचे पालक गमावले होते, ती आता 22 वर्षांची आहे.
अब्दुल्ला आणि त्याची पत्नी खदिजा यांनी तिचे लग्न एका हिंदू मुलाशी पूर्ण हिंदू विधींनी लावून दिले.
यावर चित्रपट काढण्याची… pic.twitter.com/ZvvjvMYXdO— Dr.Jitendra Awhad (@Awhadspeaks) May 6, 2023