పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురమైన ఘటన. చాలా అందగా జరగాలని ప్రతి ఒక్క యువతి యువకులు కోరుకుంటారు. అలా వారు.. తమకు తగిన వ్యక్తితో పెళ్లికి సిద్ధమవుతారు. కానీ కొన్ని సందర్భాల్లో అనుకోని సంఘటనలతో పెళ్లి అర్థాంతరంగా ఆగిపోతుంది. తాజాగా కాసేపట్లో పెళ్లి అనగా వరుడి విగ్గు ఊడిపోయింది. అతని బట్టతల చూసిన వధువు షాక్ అయింది. వెంటనే బట్టతల వ్యక్తి తనకు భర్తగా వద్దని..పెళ్లికి నిరాకరించింది. దీంతో వివాహం అర్థాంతరంగా ఆగిపోయింది. ఈఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని ఉన్నావ్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ఉత్తర్ ప్రదేశ్ లోని ఉన్నావ్ పట్టణంలో ఓ పెళ్లి కొడుకు అతనికి బట్ట తల ఉందనే నిజాన్ని దాచి పెళ్లి సిద్ధమయ్యాడు.వంద అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలంటారు. అదే రూల్ ఫాలో అయినట్లు ఉన్నాడు ఆ పెళ్లికొడుకు. అయితే పెళ్లికొడుకు ఆడిన ఆ ఒక అబద్ధం ఆ వివాహాన్నే ప్రశ్నార్థకం చేసింది. పెళ్లి తంతులో జయమాల వేడుక అనంతరం ఉన్నట్టుండి పెళ్లికొడుకు స్పృహ తప్పిపడిపోయాడు. పెళ్లికూతురు సోదరుడు వరుడి ముఖంపై నీళ్లు చల్లాడు. తలపాగా తీసే క్రమంలో వరుడు పెట్టుకున్న విగ్గు ఊడిపోయింది.
ఇదీ చదవండి: సెకండ్ హ్యాండ్ సైకిల్ కొన్న తండ్రి. సంతోషంతో మురిసిపోయిన కొడుకు! ఈ వీడియో సోషల్ మీడియాని ఊపేస్తోంది!దీంతో పెళ్లి కూతురితో పాటు వారి బంధువులు షాకయ్యారు. ఇరుకుటుంబాల మధ్య వాగ్యావదం జరిగింది. బట్టతల ఉన్న వ్యక్తిని పెళ్లిచేసుకోనని వధువు తేల్చి చెప్పింది. దీంతో వివాహ తంతు అర్థాంతరంగా ముగిసిపోయింది. దీంతో ఆ యువకుడి పెళ్లి కల చెదిరిపోయింది. ఈ విషయంపై తమకు ఎలాంటి అధికారిక ఫిర్యాదులు అందలేదని.. ఒకవేళ అందుతే చర్యలు కేసు నమోదు చేస్తామని స్థానిక పోలీసులు తెలిపారు.మరి..ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.