హైదరాబాద్ : దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ ప్రజల ఆరోగ్యం కోసం అమలు చేయని సరికొత్త పథకాన్ని ఢిల్లీ అమలు చేస్తోంది. అక్కడి ప్రజల కోసం ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకునే సౌకర్యాన్ని కల్పిస్తోంది ఆ ప్రభుత్వం. ప్రయివేట్ డయాగ్నస్టిక్ సెంటర్ల ద్వారా రోగులకు 450 రకాల పరీక్షలు ఉచితంగా అందించేందుకు అక్కడి సర్కారు ఔట్ సోర్సింగ్, ప్రైవేట్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసింది. మొహల్లా క్లినిక్‌లు, ఆసుపత్రులు, డిస్పెన్సరీలు, పాలీక్లినిక్‌లలో ఇప్పటికే అనేక పరీక్షలు ఉచితంగా అందిస్తోంది.
ప్రజల ఆరోగ్యం కోసం సరికొత్త పథకాలను అమలు చేయాలనే ఆలోచనతో ఢిల్లీ రాష్ట్రముఖ్యమంత్రి వినూత్న హెల్త్ స్కీమ్ లను అందిస్తున్నారు. అందులో భాగంగానే ప్రజలసంక్షేమం కోసం ప్రత్యేకంగా దృష్టి సారించి వారికి కనీస అవసరాలైన విద్య, వైద్యం అందించే ప్రయత్నం చేస్తున్నారు.