ఇటీవల కాలంలో గుండె పోటుతో మరణాలు చోటుచేసుకుంటున్నాయి. అదీ కూడా శుభ కార్యాల సమయంలో జరుగుతుండటంతో ఆనందంతో నిండాల్సిన ఆ ఇల్లు.. విషాదం నెలకొంటోంది. మొన్నటి మొన్న అక్కకు పెళ్లి పీటలపై గుండె పోటు వచ్చి చనిపోగా, చెల్లికిచ్చి వివాహం జరిపిన సంగతి విదితమే. తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది.
మనిషి జీవితం నీటి బుడగలాంటిది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో.. ఎప్పుడు మరణిస్తామో చెప్పలేం. ఇటీవల కాలంలో కొన్ని మరణాలు చూస్తుంటే నిజమనిపించక మానదు. అప్పటి వరకు మనతో ఉంటే మనుషులు.. క్షణాల్లో మనకు కనిపించని లోకాలకు తరలి వెళ్లిపోతున్నారు. అనారోగ్య సమస్యలతో చనిపోతున్నారు. అందులో ముఖ్యంగా గుండెపోటుతో. చిన్న, పెద్దా, సామాన్యులా, సెల్రబిలా అనే సంబంధం లేకుండా హార్ట్ స్ట్రోక్స్‌తో చనిపోతున్నారు. నటుడు తారకరత్న మరణం నుండి మొన్నయువ కానిస్టేబుల్ వరకు అందరూ దీని బారిన పడిన వారే. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, గుండె పోటు నుండి తప్పించుకోవడం వీలు పడటం లేదు. అటువంటి ఘటనే మరోటి చోటు చేసుకుంది.
బీహార్ లోని మనితార్ గ్రామానికి చెందిన సురేంద్ర కుమార్ అనే వ్యక్తికి అదే ప్రాంత యువతితో పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి రోజు రానే వచ్చింది. ఇందర్వాలో పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. దంపతులు దండలు మార్చుకుని పూజలు నిర్వహించారు. అటు బంధువుల కోలాహలం ఇటు డీజేలు హోరెత్తిస్తున్నాయి. ఈ డీజేలకు వచ్చిన వారంతా డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ డీజే సౌండ్ వరుడు సురేంద్రకు ఇబ్బందిగా మారింది. సౌండ్ తగ్గించాలని పదేపదే చెప్పినప్పటికీ ఎవ్వరూ పట్టించుకోలేదు. కొద్ది సేపటికీ ఒక్కసారిగా వేదికపైనే వరుడు సురేంద్ర కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుప్రతికి తరలించగా హార్ట్ ఎటాక్ తో ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.
డీజే సౌండ్ వల్లే ఇలా హార్ట్ ఎటాక్ వచ్చిందని వైద్యులు తెలపడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ ఘటనతో పెళ్లింట్లో విషాదం నెలకొంది. వరుడు చెబుతున్నప్పటికీ వినిపించుకోకుండా డీజేలు పెట్టినట్లు చెప్పుకుని లబోదిబోమంటున్నాయి వధూవరుల కుటుంబాలు. ఇటీవల కాలంలో డీజేల హోరుతో ప్రాణాలు పోయిన ఘటనలు చూస్తూనే ఉన్నాం. గత నెలలో డీజే కారణంగా బోధన్ లో ఓ వరుడు తుది శ్వివాస విడిచాడు. వివాహమయ్యి కొన్ని గంటలు కూడా గడవక ముందే వరుడి ప్రాణాలు వదిలిన ఘటన విన్నాం. తాజాగా బీహార్ లో మరో సంఘటన చోటుచేసుకుంది. చిన్నవయస్సులో, అదీ శుభ కార్యాల సమయంలో మరణాలు సంభవిస్తుండటం విచారకరం. చిన్నవయసులో గుండె పోటు రావడానికి కారణాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.