కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే వ్యవస్థలో అతి ప్రధానమైనది రైల్వేశాఖ. వీటి ద్వారా నిత్యం లక్షలాది మంది తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. అంతేకాక టికెట్ ధరలు తక్కువగా ఉండటంతో రైళ్లలో ప్రయాణించేందకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇదే సమయంలో వివిధ కేటగిరిలకు చెందిన ప్రయాణికులను దృష్టి పెట్టుకుని రైల్వేశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా లోయర్ బెర్త్ విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే వ్యవస్థలో అతి ప్రధానమైనది రైల్వేశాఖ. వీటి ద్వారా నిత్యం లక్షలాది మంది తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. అంతేకాక టికెట్ ధరలు తక్కువగా ఉండటంతో రైళ్లలో ప్రయాణించేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇక ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వేశాఖ అనేక చర్యలు తీసుకుంటుంది. అలానే ప్రయాణికుల సౌకర్యం కోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంది. అంతేకాక వృద్ధులు, దివ్యాగులకు రైల్వే అధికారులు అనేక రాయితీ కల్పిస్తుంది. తాజాగా దివ్వాంగుల విషయంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
దివ్యాంగుల ప్రయోజనం కోసం రైల్వే రిజర్వేషన్ కేంద్రాలను సంప్రదించకుండానే ఐఆర్సీటీసీ ద్వారా ఆన్‌లైన్ బుకింగ్ చేసుకునేందుకు రైల్వే శాఖ అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరి విషయంలో రైల్వేశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే అధికారులు తీసుకున్న ఈ నిర్ణయంతో ఇక నుంచి రైలులో దివ్యాంగుల ప్రయాణం సులభతరం కానున్నది. దివ్యాంగులతో పాటు కుటుంబీకులకు ఎక్స్‌ప్రెస్, మెయిల్ రైళ్లలోని ప్రతి బోగిలో లోయర్ బెర్తులను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులకు రైళ్ల ప్రయాణం సౌకర్యవంతంగా ఉండేందుకు రైల్వే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్లలోని ప్రతి బోగిలతో పాటు.. స్లీపర్ క్లాస్ లో నాలుగు బెర్త్.. అందులో రెండు లోయర్, రెండు మిడిల్ బెర్త్ లను దివ్యాంగులకు రిజర్వ్ చేశారు. అలానే థర్ట్ ఏసీలో రెండు బెర్త్ లు(ఒకటి లోయర్, ఒకటి మిడిల్) థర్డ్ ఎకానిమిక్ క్లాస్ లో రెండు బెర్త్ లను దివ్వాంగులకు కేటాయిస్తున్నట్లు రైల్వేశాఖ పేర్కొంది. ఇప్పటికే ఒంటరిగా, చిన్న పిల్లలతో ప్రయాణించే వృద్ధులు, మహిళలకు ఈసౌకర్యాన్ని రైల్వేశాఖ కల్పించింది. గరీబ్‌రథ్ రైళ్లలో రెండు లోయర్, అప్పర్ బెర్తులు వికలాంగులకు కేటాయించారు. అదే సమయంలో చైర్‌కార్ రైళ్లలోనూ రెండు సీట్లు దివ్యాంగులకు కేటాయించనున్నారు.
మెంటల్లీ రిటార్డెడ్ వ్యక్తులు, ఆర్థోపెడికల్ దివ్యాంగులు తోడు లేకుండా ప్రయాణం చేయలేరని, అంధులు, చెవిటి, మూగ వ్యక్తులు ఒంటరిగైనా లేదా సహాయకుడితో కలిసి ప్రయాణం చేయవచ్చని రైల్వేశాఖ అధికారులు తెలిపారు. గతంలో ఇచ్చిన విధంగా సీనియర్ సిటిజెన్స్ కు టికెట్ల రాయితీ అంశంలో రైల్వే శాఖపై ఒత్తిడి పెరుగుతోందని అధికారులు అన్నారు. దీని పైన త్వరలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి.. తాజాగా దివ్వాంగుల విషయంలో రైల్వేశాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.