ప్రభుత్వ అధికారులు అవినీతి పరుల, రౌడీల అరాచకాలను అరికడుతుంటారు. ఈ క్రమంలోనే వారి ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నారు. అలానే అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తుంటారు. తాజాగా ఓ మాజీ ఎంపీ అనుచరుడి ఇంటిని అధికారులు కూల్చి వేశారు.
ప్రభుత్వ అధికారులు అవినీతి పరుల, రౌడీల అరాచకాలను అరికడుతుంటారు. ఈ క్రమంలోనే వారి ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నారు. అలానే అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తుంటారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన మాజీ ఎంపీ, గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ అనుచరుడు ఖాలిద్ జాఫర్ ఇంటిని అధికారులు కూల్చి వేశారు. ఈ నేపథ్యంలోనే తనను పోలీసులు ఎన్ కౌంటర్ చేస్తారంటూ మాజీ ఎంపీ ఆరోపణలు చేస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే..
ఉత్తర్ ప్రదేశ్ లో సంచలనం రేపిన ఉమేశ్ పాల్ హత్య కేసులో మాజీ ఎంపీ, గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ జైలు పాలైన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా ఈ మాజీ ఎంపీ జైలు జీవితాన్ని అనుభవిస్తున్నాడు. అయితే ఇటీవల కొంతకాలం నుంచి అతడి అనుచర వర్గంపై అధికారులు ఫోకస్ పెట్టినట్లు సమాచారం. అందులో భాగంగా బుధవారం అతీక్అహ్మద్ అనుచరుడు ఖాలిద్ జాఫర్ ఇంటిని కూల్చేశారు. ప్రయాగ్ రాజ్ లో ఉన్న జాఫర్ ఇంటిని అధికారులు కూల్చేశారు. ప్రయాగ్ రాజ్ జిల్లాలోని ధుమన్ గంజ్ ప్రాంతంలోని రెండంతస్తుల ఇంటి నుంచి ఓ కత్తి, రెండు తుపాకులను స్వాధీనం చేసుకుని పోలీసులకు అందజేసినట్లు ప్రయోగ్ రాజ్ డెవలప్ మెంట్ అథారిటీ కార్యదర్శి అజిత్ సింగ్ తెలిపారు.
ఇక ఉమేశ్ పాల్ హత్య గురించి కాస్త వెనక్కి వెళ్లినట్లయితే.. 2005 లో నాటి బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్యకేసులో ప్రధాన సాక్షిగా ఉన్న ఉమేశ్ పాల్ ను ఇటీవలే చంపేశారు. అతడి అంగరక్షకులతో పాటు కలిపి నడిరోడ్డుపై కాల్చిచంపాపరు. ఈ హత్య అనంతరం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని మాఫియాను తుదుముట్టిస్తా అంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం కొన్ని రోజులకే జాపర్ ఇంటిని కూల్చేందుకు అధికారులు పూనుకోవడం గమన్హారం. అలానే ఉమేశ్ పాల్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న అర్బాజ్ ను పోలీసులు సోమవారం జరిగిన ఎన్ కౌంటర్ లో కాల్చి చంపారు.
ఈ క్రమంలోనే తనను నకీలీ ఎన్ కౌంటరులో చంపేస్తారంటూ ఎస్పీ పార్టీ మాజీ ఎంపీ, గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ బుధవారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఉమేశ్ పాల్ హత్య కేసులో అరెస్టయిన అతీక్ ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలోని కేంద్ర కారాగారంలో ఉన్నాడు. రిమాండు నిమిత్తం ప్రయాగ్ రాజ్ కు చరలించే నెంపతో తనను యూపీ పోలీసులు ఎన్ కౌంటర్ చేస్తారన్న అనుమానాన్ని అతీక్ పిటిషనులో వ్యక్తం చేశారు. తన భద్రత విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలన కోర్టును కోరాడు. మరి.. ఈ మాజీ ఎంపీ అనుచరలపై యూపీ అధికారులు చేసిన చర్యపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.