కొండ చరియల్లో ఇరుక్కుని ఒక యువకుడు ఇబ్బంది పడుతున్నాడు. కేరళలోని పాలక్కాడ్ సమీపంలోని మలప్పజ ప్రాంతంలోని కొండచరియల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. తాజాగా కేరళ మలప్పజలో కొండ చీలికలో చిక్కుకున్న యువకుడిని ఆర్మీ రక్షించింది. గత మూడు రోజులుగా కొండ చీలికలో చిక్కుకొని నరకం అనుభవించాడు యువకుడు. యువకుడిని కాపాడేందుకు సీఎం పినరై విజయన్ సైన్యం సాయం కోరాడు. ఈరోజు బెంగళూరు నుంచి పారా కమాండోలు వచ్చి రిస్క్ చేసి ఆ యువకుడిని రక్షించారు.
ఇది చదవండి: స్టార్ హీరోయిన్ విడాకుల ప్రకటన.. ఆ పనే కొంపముంచిందా?
కాగా, సోమవారం ముగ్గురు స్నేహితులు కొండ శిఖరాన్ని అధిరోహించేందుకు ప్రయత్నించారు. కానీ అది కష్టతరమని భావించిన ఇద్దరు స్నేహితులు విరమించుకున్నారు. కానీ బాబు యువకుడు మాత్రం ధైర్యం చేసి కొండ శిఖరాన్ని అధిరోహించే ప్రయత్నం చేశాడు. చివరి వరకు బాగానే చేరుకున్నా చిన్న ప్రమాదంతో కిందకు జారిపోయాడు. రెండు రోజుల నుంచి…. బాబు మలప్పజ ప్రాంతంలోని కొండ చరియల్లో ఇరుక్కొని ఆహార పానీయాలు లేకుండానే అవస్థలు పడుతున్నారు
బాబు ని రక్షించేందుకు తీరప్రాంత రక్షక దళం హెలికాప్టర్ సాయంతో రక్షించేందుకు ప్రయత్నాలు చేసింది. ఎన్డీఆర్‌ఎఫ్ దళం ఎంత ప్రయత్నించినా బాబు ను బయటకు తీసుకు రావడం సాధ్యం కాలేదు. మొత్తానికి భారత సైన్యం బాబు ని రక్షించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.