సాధారణంగా ప్రేమించుకున్న జంట పెళ్లిచేసుకుంటారు. పెద్దలు ఒప్పుకోకుంటే పారిపోయి పెళ్లి చేసుకోవటం జరుగుతుంది. మరికొందరు పెద్దల మాటకు ఎదురు చెప్పలేక విడిపోయి వేరు వేరు పెళ్లిలు చేసుకోవటం మనం చూస్తుంటాం. నేటి సమాజంలో అయితే మరీ దారుణం ప్రేమ పేరుతో తిరిగి.. ఒకవేళ మనస్పర్థలతో విడిపోతే వెంటనే ఇంకొకరితో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతుంటారు. ప్రేమించిన వ్యక్తి దక్కలేదనే బాధ కొంచెమైన ఉండదు. మరి కొందరు మాత్రం ప్రేమించిన వ్యక్తే తన జీవితమని తనని తప్ప మరొకరిని పెళ్లి చేసుకోకుడదని నిర్ణయించుకుంటారు. అలాంటి వారికి నిదర్శనం ఈ చిక్కన్న. ఎంత గాఢమైన ప్రేమలేకుంటే తను ప్రేమించిన యువతికి వేరే పెళ్లి జరిగితే బాధతో ఒంటరిగా ఉన్నడే తప్ప పెళ్లి చేసుకో లేదు. చివరికి 65 ఏళ్ల వయ్ససులో తన ప్రేయసిని దక్కించుకున్నాడు. అసలు ఆ కథ ఏమిటి? ఎక్కడ జరిగింది? చూద్దాం.
కర్నాటకలోని మైసూర్ లోని హెబ్బాళ ప్రాంతానికి చెందిన చిక్కన్న, జయమ్మ యుక్త వయస్సులో గాఢంగా ప్రేమించుకున్నారు. పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించలేదు. సడెన్ గా ఓ రోజు జయమ్మకు వారి పెద్దలు వేరే వ్యక్తితో పెళ్లి చేశారు. దీంతో ప్రేయసి దక్కలేదని తీవ్ర వేదనకి లోనయ్యాడు చిక్కన్న. ఆమె దక్కలేదన్న బాధతో ఒంటరిగా మిగిలిపోయడు. ఆమెతో గడిపిన జ్ఞాపకాలుతో ఉన్నడే తప్ప..మరొకరిని పెళ్లి చేసుకోలేదు. పెళ్లైన కొంత కాలానికి జయమ్మ భర్త చనిపోయాడు. ఆమెకు పిల్లలు లేరు. అప్పటి నుంచి వీరిద్దరు తమ పాత జ్ఞాపకాల్ని నెమరేసుకుంటూ వేరువేరుగా జీవిస్తున్నారు.
ఇంతాకాలం వేరువేరుగా ఉన్న వీరు కనీసం జీవిత చివరి దశలో అయిన ఇద్దరు కలిసి జీవించాలనుకున్నారు. ప్రేమ అంటే కేవలం శరీరాల కోసం పుట్టేదే కాదని…మనస్సుల కలయిక కోసం పుట్టేది అసలు ప్రేమని వారు అనుకున్నారు. అందుకే సమాజాన్ని, కటుబాట్లను కాదని 65 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకున్నారు చిక్కన్న, జయమ్మ. గురువారం మాండ్యం జిల్లా మేలుకోటెలో సాంప్రదాయ ప్రకారం వీరి పెళ్లి జరిగింది.సంప్రదాయం ప్రకారం ఆమెకు అరుంధతీ నక్షత్రం కూడా చూపించాడు.వీరిద్దరి పెళ్లి స్థానికులను ఆశ్చర్యపరిచింది.ఈ లేటు వయస్సులో వీరు చేసుకున్న పెళ్లి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.