మణిపూర్‌లో జవాన్లపై ఉగ్రవాదులు దాడి చేశారు. 46 అస్సోం రైఫిల్స్ జవాన్లతో వెళ్తున్న కావ్వాయ్‌పై చూరచాంద్‌పూర్ జిల్లా బెహియాంగ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఈ దారుణానికి తెగపడ్డారు. ఈ దాడిలో నలుగురు జవాన్లతో పాటు కమాండింగ్ ఆఫీసర్ విప్లవ్ త్రిపాఠీ, ఆయన భార్య, కుమారుడు మృతి చెందినట్లు సమాచారం. ఈ దాడి జరిగిన తీరు పుల్వామా ఉగ్రదాడిని గుర్తుకు తెచ్చేలా ఉంది. కాగా ఈ దాడి గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.