గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా కనిపించే మహిళలు, వృద్దులను టార్గెట్ చేసుకొని బైక్స్ పై వచ్చి వారి మెడలో చైన్ లాక్కొని వెళ్తున్నారు. ఇలాంటి ఘటనలో కొన్నిసార్లు మహిళలు తీవ్రంగా గాయపడుతున్నారు.
ఇటీవల ఈజీ మనీ కోసం కొంతమంది కేటుగాళ్లు ఒంటరిగా ఉన్న మహిళలు, వృద్దులను టార్గెట్ చేసుకొని చైన్ స్నాచింగ్ కి పాల్పపడుతున్నారు. అడ్రస్ అడుగుతున్నట్లు నటించి మహిళల మెడలో బంగారు ఆభరణాలు బలవంతంగా లాక్కొనిపోతున్నారు. చైన్ స్నాచింగ్ చేసే సమయాల్లో మహిళలు గాయపడటం.. కొన్నిసార్లు చనిపోవడం కూడా జరుగుతుంది. అదే సమయంలో కొంత మంది మహిళలు దొంగలను ఎదిరించి పోరాడిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇలాంటి ఘటనలు ప్రతిరోజూ దేశ వ్యాప్తంగా ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ వృద్దురాలి మెడలో చైన్ లాగే ప్రయత్నం చేస్తుండగా పక్కనే ఉన్న పదేళ్ల బాలిక ఆ దొంగకు జుట్టుపట్టి లాగి కొట్టింది. ఈ ఘటన మహారాష్ట్ర చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్ర పూణె లో బుధవారం సాయంత్రం లతా ఘాగ్ అనే వృద్దురాలు తన మనవరాళ్లతో రోడ్డు పై నడుచుకుంటూ దగ్గరలోని ఓ పార్క్ కి వెళ్తుంది. రాత్రి 8 గంటల సమయం కావడంతో ఆ చుట్టు పక్కల జనసంచారం తక్కువగా ఉంది. అదే సమయంలో స్కూటీపై ఓ వ్యక్తి వృద్దురాలిని ఆపి అడ్రస్ గురించి అడిగినట్టు యాక్టింగ్ చేసి ఆమె మెడలో ఉన్న చైన్ లాగే ప్రయత్నం చేశాడు. ఒక్కసారే యువకుడు లతా ఘాగ్ మెడలో చైన్ లాగే ప్రయత్నం చేయడంతో.. అతడి నుంచి విదిలించుకోవడానికి ప్రయత్నించింది. అంతలోనే లతా ఘాగ్ పదేళ్ల మనవరాలు రుత్వి ఘాగ్ ఆ దొంగ జుట్టు పట్టుకొని లాగి కొట్టింది. చేతిలో ఉన్న బ్యాగ్ తో ముఖంపై పదే పదే కొట్టడంతో దొంగ చైన్ వదిలి అక్కడ నుంచి పారిపోయాడు.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ వృద్దురాలి మనవరాళు అయిన రుత్వి ఘాగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. రాత్రి వేల దొంగను చూసి భయపడకుండా పదేళ్ల ఆ బాలిక చేసిన ధైర్యసాహసాలు ఎంతో గొప్పవిగా ఉన్నాయని.. మహిళా దినోత్సవం రోజు మహిళల పవర్ ఏంతో ఆ బాలిక చూపించిదని మెచ్చుకుంటున్నారు. చైన్ స్నాచింగ్ పాల్పపడేవారికి ప్రతి ఒక్క మహిళ ధైర్యంతో పోరాడి వాళ్ల భరతం పట్టాలని సూచిస్తున్నారు నెటిజన్లు. చైన్ స్నాచర్ ని ఎంతో ధైర్యంతో ఎదిరించి పోరాడిన రుత్వి ఘాగ్ గురించి మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
📍Pune: A brave 10-year-old girl attacks chain snatcher & saves her grandmother.@Journo_Swarali reports | #Pune #Maharashtra pic.twitter.com/P3eMYTci4s
— Mirror Now (@MirrorNow) March 9, 2023