సాధారణంగా మత్స్యకారులు వేటకు వెళ్ళినప్పుడు రక రకాల చేపలు పడుతుంటాయి. కొన్ని సార్లు అదృష్టం కొద్ది వారి భారీ చేపలు పడటం.. అధిక ధరలకు అమ్మడం చూస్తుంటాం. అలాంటిది అరుదైన భారీ చేప వలకు చిక్కితే.. దాని ధర లక్షల్లో ఉంటే.. ఆ మత్సక్యారుల సంబరాలు అంబరాన్ని అంటుతాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ సుందర్ బన్ అడవుల సమీపంలో ఉన్న సుందర్ బన్ నదిలో ఓ భారీ చేప మత్స్యకారుల వలలో చిక్కుకుంది.
ఈ చేప 7 అడుగుల పొడవు, 78.4 కిలోల బరువు ఉంది. అరుదైన ‘తెలియా భోలా ఫిష్’ గా గుర్తించారు. సుందర్ బన్ నదిలో చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుల బృందం వలలో అతి భారీ చేప చిక్కింది. దాన్ని అతి కష్టం మీద పైకి లాగి వలను ఒడ్డుకు చేర్చారు. ఈ చేపను చూడడానికి స్తానికులు భారీగా తరలివచ్చారు. తమకు అదృష్టాన్ని తీసుకు వచ్చిన భారీ చేపను క్యానింగ్ మార్కెట్‌కు వేలానికి తరలించారు.
వేలంలో ఈ భోలా ఫిష్ రూ. 36,53,605 ల ధర పలికింది. కోల్‌కతాకు చెందిన అనే చేపల వ్యాపార సంస్థ ఈ చేపను వేలంలో దక్కించుకుంది. ఇంత భారీ చేపను వేలం కోసం మార్కెట్‌కు తీసుకురావడం ఇదే తొలిసారి అని ఓ మత్స్యకారుడు తెలిపారు. కాగా, వేలంలో కిలో రూ.47,880 చొప్పున అమ్ముడయ్యిందని క్యానింగ్‌లోని చేపల వ్యాపారి ప్రభాత్ చెప్పాడు.
ఈ చేప స్పెషల్ ఏంటీ? ఎందుకంత ఖరీదు :
మనిషి సైజు ఉండే ఈ చేపలను తెలియా భోలా’ అని పిలుస్తారు. ఇందులో అద్భుతమైన ఔషదాలు దాగి ఉన్నాయని అంటారు. దీని చర్మానికి కూడా మంచి డిమాండ్ ఉంది. కిలో చర్మం దాదాపు రూ.80 వేలు ఉంటుందంటే ఈ చేపకున్న డిమాండ్‌ని అర్థం చేసుకోవచ్చు. ఔషధాల తయారీలో ఉపయోగించడానికి ఎగుమతి చేయబడుతుంది. అందుకే ఈ చేప ఎక్కువ ధర చెల్లించేందుకు సిద్దమవుతుంటారు.