ఇటీవల పలు చోట్లు పాఠశాల విద్యార్థులతో పనులు చేయిస్తున్న టీచర్ల బాగోతాలు బయటపడుతున్నాయి. విద్యతో విజ్ఞానాన్ని అందించే గురువులను దేవుళ్లతో పోల్చుతుంటారు.. కానీ ఈ మద్య కొంతమంది గురువు స్థానానికి మచ్చతెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు.
తల్లిదండ్రుల తర్వాత అంతగొప్ప స్థానం ఒక్క గురువుకే ఇస్తారు. పిల్లలకు తల్లిదండ్రులు జన్మనిస్తే.. ఉపాధ్యాయులు వారికి విద్య నేర్పించి సమాజంలో గొప్ప స్థానంలో ఉంచే బాధ్యత తీసుకుంటారు.. అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః అంటూ త్రిమూర్తులతో పోలుస్తారు. ఎంత గొప్ప స్థానంలో ఉన్నా సరే గురువులను మర్చిపోవొద్దు అంటారు. కానీ ఈ మద్య కొంతమంది గురువు స్థానంలో ఉండి దారుణాలకు తెగబడుతున్నారు. విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించే టీచర్లు తమ సొంత పనులు చేయించుకుంటున్నారు.. కొన్ని చోట్ల మరుగు దొడ్డు కడిగించడం, పాఠశాల ప్రాంగణాలు శుభ్రం చేయించడం లాంటివి చేస్తున్నారు. ఇలాంటి దృశ్యాలు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు దర్శమిస్తూనే ఉన్నాయి. తాగాగా ఓ పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులకు చీపురు ఇచ్చి శుభ్రం చేయిస్తున్న ఘటన కాన్పూర్ జిల్లాలోని వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే..
ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్ జిల్లాలో ఓ పాఠశాలలో ఉపాధ్యాయులు స్కూల్ విద్యార్థులకు చీపురు ఇచ్చి పాఠశాల ప్రాంగణం మొత్తం శుభ్రం చేయించారు. అక్కడ చిన్న చిన్న పిల్లలతో సైతం టీచర్లు దగ్గరుండి మరీ శుభ్రం చేయించడానికి సంబంధించిన ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో చూసిన విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఆర్థిక స్థోమత లేక ప్రేవేట్ పాఠశాలలకు పంపించలేక ప్రభుత్వ పాఠశాలలకు పంపితే తమ పిల్లలతో ఇలాంటి పనులు చేయిస్తారా? అంటూ తల్లిదండ్రులు ఉపాధ్యాయులను నిలదీస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు విచారణ జరిపిస్తున్నట్లు తెలుస్తుంది.
సాధారణంగా విద్యార్థులను ఉపాధ్యాయులు చితకబాధి, హింసిస్తున్న ఘటనలకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడం చూశాం. కొన్నిచోట్ల విద్యార్థులతో మరుగుదొడ్లు, బాత్ రూమ్స్ శుభ్రం చేయించిన ఘటనలు చూశాం.. అయితే చిన్న పిల్లలకు చీపురు అందించి దగ్గరుండి మరీ శుభ్రం చేయించిన ఉపాధ్యాయులు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అటు విద్యార్థుల తల్లిదండ్రులు, ఇటు నెటిజన్లు ఉపాధ్యాయులపై మండిపడుతున్నారు.. వారిపై చర్యలు తీసుకోవాలంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.