తల్లిదండ్రుల తర్వాత అంత గొప్ప స్థానం విద్యాబుద్దలు నేర్పించే గురువులకే ఇస్తారు. అందుకే గురువును త్రిమూర్తులతో పోల్చుతారు. ఒకప్పుడు విద్యార్థులకే కాదు.. తల్లిదండ్రులకు కూడా గురువుల పట్ల గౌరవం, భక్తి భావం ఉండేది. ఈ మద్య కొంత మంది గురువు స్థానానికి మచ్చతెచ్చే విధంగా ప్రవర్తిస్తూ సొసైటీలో పరువు పోగొట్టుకుంటున్నారు. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల ముందు మద్యం సేవించి పాట పడుతూ.. డ్యాన్స్ వేస్తూ రచ్చ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
పంజాబ్ లోని జిఎన్ డియూ కాలేజ్ లో మ్యాథ్స్ టీచర్ గా విధులు నిర్వహిస్తున్నట్టు సమాచారం. క్లాస్ రూమ్ లో ఓ బాటిల్ తీసుకొని తాగుతూ డ్యాన్స్ వేశాడు.. అంతే కాదు తాను తన సొంత డబ్బు పెట్టుకొని మద్యం తాగుతున్నాను.. నన్ను అడిగే హక్కు ఎవరికీ లేదు అంటూ మాట్లాడటం వీడియోలో రికార్డు అయ్యింది. కొద్ది సేపటి తర్వాత బాటిల్ పక్కన బెట్టి ఓ పాటకు డ్యాన్స్ చేశాడు. ఆ పాట పాడుతూ డ్యాన్స్ చేస్తున్నంత సేపు పక్కన ఉన్నవారు కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నట్లు వీడియోలో తెలుస్తుంది.
కాలేజ్ లో క్లాస్ రూమ్ లో ఇంత బహిరంగంగా మద్యం సేవించి డ్యాన్స్ చేయడానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో సదరు ఉపాధ్యాయుడిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన సదరు ఉపాధ్యాయుడు ఈ వీడియో తనదే అని.. కాకపోతే తాను మద్యం సేవించలేదని.. విద్యార్థులను నవ్వించడానికి తాను తాగినట్లు నటించానని చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రక రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. ఈ వీడియో పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.