తమిళనాడు ముఖ్యమంత్రిగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న ఎంకే స్టాలిన్ మరో వినూత్న నిర్ణయం తీసుకున్నారు. రిజర్వేషన్లకు సంబంధించి ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షం అన్నాడీఎంకే కూడా స్వాగతించడం విశేషం. బ్యాగుల మీద ఫోటోలు మార్చడానికి ఖర్చు కావద్దనే కారణంతో రాజకీయ ప్రత్యర్ధుల ఫోటోలు ఉంచడం, తమను అసెంబ్లీలో భజన చేసే ఎమ్మెల్యేల విషయంలో కఠినంగా వ్యవహరిస్తానని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఆయన మీద పవన్ కల్యాణ్ ప్రసంశల వర్షం కురిపించారు. ”ఏ పార్టీ అయినా ప్రభుత్వంలోకి రావడానికి రాజకీయం చెయ్యాలి కానీ – ప్రభుత్వంలోకి వచ్చాక రాజకీయం చేయకూడదు, దీన్ని మీరు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు. మీ పరిపాలన, మీ ప్రభుత్వ పనితీరు మీ ఒక్క రాష్ట్రానికే కాదు దేశంలోని అన్ని రాష్ట్రాలకు, అన్ని రాజకీయ పార్టీలకు మార్గదర్శకం స్ఫూర్తిదాయకం, మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మీకు నా శుభాకాంక్షలు అని అధ్యక్షులు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
తమిళనాడు స్టాలిన్ కు సోషల్ మీడియాలో ప్రసంశల వర్షం కురుస్తోంది. ఎందుకంటే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలే దానికి కారణం. ఇటీవల స్టాలిన్ తనదైన శైలిలో ముందడుగు వేస్తూ దేశప్రజల ప్రశంసలని అందుకుంటున్నారు. ఇప్పుడు పవర్ స్టార్ కూడా మెచ్చుకోవడంతో బాగా వైరల్ అవుతోందీ ట్వీట్ మనం చేసే పనులను బట్టి పొగడ్తలు వస్తుంటాయి. కానీ, వాటికి కూడా సమయం సందర్భం అనేవి ఉండాలి. అసెంబ్లీ సెషన్ జరుగుతుండగా సీఎంను ప్రసన్నం చేసుకోవడానికి కొందరు నేతలు పొగడ్తలతో ముంచెత్తడం మనం ఎన్నోసార్లు లైవ్‌లో చూసి ఉంటాం. అయితే, తమిళనాడు సీఎం స్టాలిన్ పోగడ్తల కన్నా పనే ముఖ్యమంటున్నారు. తాజాగా సభా సమయంలో తనను ప్రశంసిస్తున్న డీఎంకే పార్టీ నేతలకు ఆయన సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు.
To Hon. CM @mkstalin garu, pic.twitter.com/iIo0YMD1vT
— Pawan Kalyan (@PawanKalyan) August 31, 2021