ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టిన సీఎం జగన్ మోహన్ రెడ్డి..పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రజలకు పారదర్శక పాలన అందించేందుకు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ప్రజలకు సత్వర ఫలితం అందుతుంది. ఇప్పుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి బాటలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ వెళ్తున్నారు. ఏపీలో మాదిరిగానే తమిళనాడులోనూ గ్రామ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రజలకు పారదర్శక పాలన అందించేందుకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని సీఎం స్టాలిన్ అన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది 600 గ్రామ సచివాలయాలను నిర్మిస్తామని తెలిపారు. అలాగే ఉత్తమ పట్టణ పంచాయతీలకు “ఉత్తమర్ గాంధీ” అవార్డులను ప్రదానం చేయనున్నట్లు చెప్పారు.
అసలు పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం పంచాయతీల ప్రగతి, పట్టణ పంచాయతీలకు సంబంధించిన అంశాలపై సీఎం స్టాలిన్ మాట్లాడారు. “ప్రజాస్వామ్య దేశంలో పట్టణ పంచాయతీ పాలనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇవి బలంగా ఉంటేనే ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అమలు చేయగలం.DMK అధికారంలోకి వచ్చినప్పుడల్లా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం.ఆ మేరకు 2007 నుంచి 2010 వరకు నవంబరు 1వ తేదీ జరుపుకున్నాం. గతంలో కరుణానిధి సీఎంగా ఉన్న సమయంలో ఏడాదికి నాలుగు సార్లు గ్రామ సభలు నిర్వహించాలని చట్టం తెచ్చారు. అలానే ఇక ఈ ఏడాది నుంచి కూడా ఏటా ఆరు గ్రామసభలు నిర్వహిస్తాం. పరిపాలనా సౌలభ్యం కోసం ఈ ఏడాది 600 గ్రామ సచివాలయ భవనాలను నిర్మిస్తాం” అని తమిళనాడు సీఎం స్టాలిన్ వివరించారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.