మనిషి సాంకేతికంగా, విజ్ఞానపరంగా ఎంత అభివృద్ధి చెందినా.. అంతరిక్షంలో కాలు మోపినా.. సమాజంలోని కొన్ని దురలవాట్లను మాత్రం వదలుకోలేకపోతున్నాడు. వాటిల్లో ముఖ్యమైనది మూడనమ్మాలకను పాటించడం. ఇలాంటి వాటి గురించి శాస్త్రవేత్తలు, నిపుణులు ఎన్నిసార్లు అవగాహన కల్పించే ప్రయత్నం చేసినా.. మార్పు రావడం లేదు. తాజాగా తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలోని ఓ గ్రామం మూఢనమ్మకాలకు పరాకాష్టగా మారింది. దేవుడి మొక్కు తీర్చుకోవడం కోసం వింత ఆచారాన్ని పాటిస్తున్నారు ఆ గ్రామ వాసులు. మొక్కు తీర్చుకోవడంలో భాగంగా.. సలసలా కాగే నెయ్యిని తీసుకుని ఒళ్లంతా పూసుకుంటున్నారు. అంతేకాక.. మరుగుతున్న నెయ్యిలోని నుంచి వంటకాలను ఉత్తి చేతులతోనే బయటకు తీస్తున్నారు. వింటుంటూనే భయంతో ఒళ్లు జలదరించే ఈ షాకింగ్ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: ఆ ఊరి రైతులు ఎక్కడా అప్పు చేయరు! లోన్ తీసుకోరు!
విదునగర్ జిల్లా తిరుచిరాపల్లి సమీపంలోని పులియందర్‌కోట్టై గ్రామంలోని జనాలు ఈ మూఢనమ్మకాన్ని పాటిస్తున్నారు. ఈ గ్రామంలో 200 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీమరనాడు కరుప్పనస్వామి ఆలయ ఉంది. ప్రతి ఏడాది స్వామి వారి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ పండుగ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. దీని తర్వాత పండుగలో ప్రధాన ఘట్టం ప్రారంభం అవుతుంది. దీనిలో భాగంగా భక్తులు నెయ్యి మరుగుతున్న పాత్రలోని వంటలను చేతులతో కాల్చే కార్యక్రమం జరుగుతుంది.
ఈ ఉత్సవాల్లో ముందుగా పట్టణంలోని శ్రీమంతయమ్మన్ ఆలయ పీఠం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తరువాత ఉపవాసం ఉన్న భక్తులు చేతులకు వేడి వేడిగా కాచిన నెయ్యి పూసుకుని, చేతులు, మొహం, కాళ్లపై చల్లుకుని, చేతితో టపాకాయలు తీసుకోవడం ఆనవాయితీ. మరుగుతున్న నెయ్యిలో ఉన్న వంటకాలను తమ చేతులతో తీసి స్వామి వారికి మొక్కులు చెల్లిస్తారు.అంతేకాక తమతో పాటు అగ్గిపుల్లలు, ఇరవై ఒక్క కన్నుల పటాకులు తీసుకొచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.
ఇది కూడా చదవండి: ఒకప్పుడు ఆటో డ్రైవర్..ఇప్పుడు ఏకంగా మేయర్ అయ్యాడు!
ప్రతి ఏటా జరిగే ఈ వేడుకలకి విరుదునగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న భక్తులు తరలివస్తారు. తమ ఒంటిని కాల్చుకుని.. మొక్కలు చెల్లిస్తే.. స్వామి వారు.. తమ కోర్కెలను నెరవేరుస్తారని గ్రామస్థులు విశ్వాసం. ప్రసుత్తం ఏ ఉత్సవానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. భక్తి పేరు చెప్పి ఇలా మిమ్మల్ని మీరు హింసిచుకోవడం ఏంటి.. ఇది మూఢభక్తి అని నెటిజనులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వింత నమ్మకంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.