నేటి సమాజంలో కొన్ని మతాల పేరుతో కొందరు వ్యక్తులు చేయరాని పనులకు తెగబడుతున్నారు. తాజాగా ఓ పాస్టర్ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్ టాప్ లో సుమారు 50 మందికి పైగా మహిళల అశ్లీల ఫోటోలు, వీడియోలు ఉన్నట్లు సమాచారం. సంచలనం రేపిన ఈ సంఘటన తమిళనాడులో జరిగింది.
నేటి సమాజంలో కొన్ని మతాల పేరుతో కొందరు వ్యక్తులు చేయరాని పనులకు తెగబడుతున్నారు. దేశంలో ఎక్కడో ఓ చోట.. రోజు ఏదో ఒక సంఘటన వెలుగులోకి వస్తూనే ఉంటోంది. తాజాగా తమిళనాడు లోని కన్యాకుమారి జిల్లాలో ఓ పాస్టర్ విద్యార్థినుల, మహిళల న్యూడ్ వీడియోలను తీసి బెదిరిస్తున్నట్లుగా పోలీసులుకు ఫిర్యాదులు అందాయి. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా.. విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆ పాస్టర్ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్ టాప్ లో సుమారు 50 మందికి పైగా మహిళల అశ్లీల ఫోటోలు, వీడియోలు ఉన్నట్లు సమాచారం. తమిళనాడులో సంచలనం రేపిన ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెనెడిక్ట్ ఆంటో కన్యాకుమారి జిల్లా కలియకవిలై సమీపంలో ఫాతిమా పట్టణంలో నివస్తున్నాడు. ఇక ఆ ప్రాంతంలోని పిలంగలై ప్రాంతంలో ఉన్న చర్చిలో ఫాదర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇక రోజు చర్చికి ప్రార్థనల కోసం వచ్చే విద్యార్థినుల, మహిళల వివరాలను తెలుసుకుని వారిని లైంగికంగా వేధించేవాడని, అలాగే పరిచయం ఉన్న మహిళలకు వాట్సప్ కాల్స్ చేసి అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. ఈ నేపథ్యంలోనే చాలా మంది మహిళలు అతడిపై ఫిర్యాదు చేశారు. అసలు ఈ పాస్టర్ బాగోతాన్ని బయటపెట్టింది ఓ న్యాయ విద్యార్థి. అతడి పేరు ఆస్టిన్ జినో. అతడి కారణంగానే ఈ పాస్టర్ అరచకాలు బయటకు వచ్చాయి.
ఆస్టిన్ జినో, బెనెడిక్ట్ కు మహిళలను లైంగికంగా వేధిస్తున్నాడని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నాడు. దాంతో ఆ పాస్టర్ ఆస్టిన్ ను తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో ఆస్టిన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆస్టిన్ తల్లి.. డైరెక్ట్ గా జిల్లా ఎస్పీని కలిసి.. జరిగింది అంతా సాక్ష్యాలతో సహా వివరించింది. దాంతో ఎస్పీ పోలీసులుకు ఆదేశాలు జారీ చేశాడు.. ఇక మహిళల నుంచి ఫిర్యాదులు అందుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు. విచారణనలో భాగంగా అతడి ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నారు. మహిళల ఫిర్యాదుతో బెనెడిక్ట్ ఆంటో పై కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే అతడిని అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.