మద్యం మత్తులో తాగుబోతులు చేసే విన్యాసాలు మాములుగా ఉండవు. సాధారణంగా కప్పను చూసినా భయపడే వ్యక్తులు.. తాగిన మైకంలో.. ఏకంగా పాముతోనే పరాచికాలాడుతారు. ఈ కోవకు చెందిన చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
మద్యం.. మంచి చెడు విచక్షణ ఆలోచించనీయదు. మద్యం మత్తులో ఉన్న వారు ఏం చేస్తున్నారో.. ఎలా ప్రవర్తిస్తున్నారో వారికే తెలియదు. ఇక మన సమాజంలో జరుగుతున్న సగం నేరాలకు మద్యపానమే ప్రధాన కారణం. మద్యం మత్తులో ప్రాణాలు కోల్పోవడం, తీయడం వంటి నేరాలు పెరుగుతున్నాయి. మద్యపానం ఆరోగ్యానికి హనికరం అని ఎంత చెప్పినా.. మందు బాబులు మాత్రం మానరు. తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమే కాక.. కుటుంబ ఆర్థిక పరిస్థితిని సైతం దిగజారుస్తారు. ఒక్కసారి మద్యానికి బానిసైతే.. ఇక ఆ మత్తు నుంచి బయటపడటం అంత తేలిక కాదు. ఇక మద్యం మత్తులో.. తాగుబోతులు కొన్ని సార్లు.. రకరకాల విన్యాసాలు చేసి.. ఆఖరుకి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. తాగిన మత్తులో ఓ వ్యక్తి ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కి ఎంత దారుణానికి ఒడిగట్టాడు అంటే..
భార్య పుట్టింటికి వెళ్లింది.. ఎన్నిసార్లు పిలిచినా రావడం లేదు. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేద్దామని వెళ్లాడు ఓ వ్యక్తి. తాగిన మైకంలో ఉన్న వ్యక్తి.. ఉన్నట్లుండి సడెన్‌గా ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కి హైటెన్షన్ వైరును నోటితో కొరికాడు. ఇంకేముందు.. తీవ్రంగా గాయపడటంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. బాధితుడిని చిన్నమంగోడు ప్రాంతానికి చెందిన ధర్మదురైగా గుర్తించారు. ఇతడికి రెడ్డిపాలయం గ్రామానికి చెందిన మహిళతో వివాహం అయ్యింది. అయితే గత కొంతకాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దాంతో ధర్మదురై భార్య.. అతడిని వదిలేసి.. పుట్టింటికి వెళ్లింది.
అయితే తన బావమరుదుల వల్లనే భార్య.. తన దగ్గరకు రావడం లేదని భావించిన ధర్మదురై.. దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేయాలని భావించాడు. ఈ క్రమంలో బుధవారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అప్పటికే పూటుగా తాగేసి ఉన్నాడు. పోలీసులు అతడిని వెయిటింగ్ రూమ్‌లో కూర్చోమని చెప్పారు. అయితే పోలీసులు మాటలు పట్టించుకోకుండా బయటకు వచ్చిన ధర్మదురై.. స్టేషన్ ప్రాంగణంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కాడు. ఇది చూసి చుట్టుపక్కల జనాలు భయంతో కేకలు వేస్తూ.. అతడిని వారించే ప్రయత్నం చేశారు. ఇంతలో బయటకు వచ్చిన పోలీసులు ధర్మదురైని కిందకు దిగమని ఆదేశించారు.
కానీ మత్తులో ఉన్న అతడు.. వారి మాటలు పపట్టించుకోలేదు. ట్రాన్స్‌ఫార్మర్ మీదకు ఎక్కడమే కాక.. హైటెన్షన్ వైర్‌ను కొరికాడు. దాంతో అక్కడ మంటలు చెలరేగడమే కాక.. ఈ ఘటనలో ధర్మదురై తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Drunk Tamil Nadu man climbs transformer, bites high-tension wire pic.twitter.com/US0XIGUAab
— venky bandaru (@venkybandaru13) April 6, 2023