అమ్మ.. ఈ పదం ప్రతి బిడ్డను కదిలిస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ‘అమ్మ’ అనే పదం అన్ని భావోద్వేగాలతో ముడిపడి ఉంది. ఏ కష్టంలో ఉన్నా.. దూరభారాలను ఫీలైనా.. ఆఖరికి పడుకునే ముందు ఒక్కసారి అయినా అమ్మానాన్నలను తలుచుకుంటూ ఉంటాం. నాన్నని స్నేహితుడిగా, టీచర్ గా భావిస్తాం కాబట్టి.. ఎల్లప్పుడూ స్ట్రాంగ్ గానే ఉంటాడు. ఎప్పుడైనా మాట్లాడొచ్చులే అనుకుంటాం. జీవితంలో పెరుగుతున్నకొద్దీ నాన్న విలువ తెలుస్తుంది. కానీ, అమ్మ విషయానికి వస్తే ఎంతో ఎమోషనల్ అయిపోతాం. ఎందుకంటే.. ప్రతి జీవితంలో నాన్న కంటే అమ్మ పాత్రే ఓ మెట్టుపైన ఉంటుంది. అందుకే వాళ్ళు ఉన్నప్పుడే సంతోషపరచాలి అంటుంటారు.
ముఖ్యంగా అమ్మ చేసే త్యాగాలను ఆలస్యంగా గ్రహిస్తుంటారు పిల్లలు. కానీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగితే.. కలిగే బాధను ఎవరు తీర్చలేరు. అమ్మ ప్రేమ ముందు ఏదైనా చిన్నబోవాల్సిందే. తాజాగా తమిళనాడుకు చెందిన ఓ డెంటిస్ట్.. తన తల్లి ప్రేమను ఆలస్యంగా తెలుసుకొని ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యాడు. తన తల్లి ప్రేమ ఎవరు అందుకోలేని స్థాయిలో ఉంటుందని గ్రహించి.. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఆ డెంటిన్ట్ పోస్ట్ నెట్టింట అందరిని కదిలిస్తోంది. తమిళనాడుకు చెందిన సీనియర్ డెంటిస్ట్ విక్రమ్ ఎస్ బుద్దనేశన్. తన తల్లి అన్నం తినే పళ్లెం(ప్లేటు) ఫోటో షేర్ చేస్తూ.. ఆ ప్లేటు వెనకున్న ఎమోషనల్ స్టోరీ షేర్ చేశాడు.
‘ఇది మా అమ్మ ప్లేటు. గడిచిన 2 దశాబ్దాలుగా మా అమ్మ ఈ ప్లేటులోనే అన్నం తినేది. ఆమె తర్వాత నన్ను, నా మేనకోడలు శృతిని ఈ ప్లేటులో తినడానికి అనుమతించేది. అయితే.. అమ్మ చనిపోయాక నా సోదరి చెబితే తెలిసింది. ఈ ప్లేట్ 23 ఏళ్ల క్రితం నేను స్కూల్లో గెల్చుకున్న ప్రైజ్ అని.’ అని విక్రమ్ రాసుకొచ్చారు. 1999లో 7వ తరగతి చదివేటప్పుడు విక్రమ్ ఈ ప్లేటుని ప్రైజ్ గా గెలిచాడట విక్రమ్. కొడుకు సాధించిన విజయం కదా! ఆ ప్లేటును బంగారు పతకం కన్నా ఎక్కువగా భావించిన తల్లి.. అప్పటినుండి అదే ప్లేటులో తింటూ వచ్చిందట. కొడుకు మీద, కొడుకు సాధించిన గెలుపు మీద ఆ తల్లికున్న ప్రేమ అలాంటిది. ఎందుకోమరి చివరిదాకా ఆ ప్లేటు గురించి కొడుకుకు ఏనాడూ చెప్పలేదు.
ప్రస్తుతం డాక్టర్ విక్రమ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. అందరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది. చూశారు కదా! తల్లి ప్రేమ ఎలా ఉంటుందో, ఎంత విలువైందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. బిడ్డలను కని, పెంచి, వారి ఎదుగుదలను చూసి ఆనందించే తల్లులు.. ఎప్పటికీ ఆదర్శంగానే ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళ ప్రేమ బయటికి కనిపించవచ్చు, కొన్నిసార్లు కనిపించకపోవచ్చు. కానీ.. పిల్లలు సాధించే చిన్న చిన్న విషయాలు కూడా జీవితాంతం గుర్తుంచుకునే మనసులు వారివి. అందుకే.. తల్లిదండ్రులు బ్రతికి ఉన్నప్పుడే వారిని సంతోష పెట్టేందుకు, సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నించండి. మరి డాక్టర్ విక్రమ్ – తన తల్లికి సంబంధించి ఈ మెమొరబుల్ ప్రైజ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి.
This is Amma’s plate.. she used to eat in this for the past 2 decades.. it’s a small plate.. she allowed only myself and chulbuli (Sruthi, my niece) only to eat in this other than her.. after her demise only I came to know through my sister, that this plate was a prize won by me pic.twitter.com/pYs2vDEI3p
— Vikram S Buddhanesan (@vsb_dentist) January 19, 2023