ఎన్నికల వేళ ప్రధానంగా వినిపించే హామీ.. మద్యపాన నిషేధం. తమను గెలిపిస్తే.. మద్యం అమ్మకాలను పూర్తిగా నిలిపివేస్తామని రాజకీయా పార్టీలు హామీలు ఇస్తాయి. తీరా గెలిచాక.. దాన్ని గాలికి వదిలేస్తాయి. కానీ ఓ రాష్ట్రం మాత్రం.. మద్యపాన అమలు దిశగా చర్యలు ప్రాంరభించింది. ఆ వివరాలు..
మద్యపానం.. దీని వల్ల కలిగే నష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే. సమాజంలో జరిగే సగం నేరాలకు మద్యపానమే ప్రధాన కారణం. తాగిన మైకంలో ఏం చేస్తున్నారో అర్థం కాదు. మత్తు దిగేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. రోడ్డు ప్రమాదాలు, అత్యాచారాలు, హత్యలు, దొంగతనాలు ఇలాంటి నేరాలన్నింటికి ప్రధాన కారణం మద్యపానమే. ఇక తాగుడు వల్ల అనారోగ్యం పాలై.. ఎందరో ప్రాణాలు విడుస్తున్నారు. ఫలితంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడతాయి. మద్యపానం వల్ల ఇన్ని నష్టాలు ఉంటాయని తెలిసినప్పటికి.. ప్రభుత్వాలు ఎందుకు.. దీన్ని నిషేధించడం లేదు అంటే.. మద్యం మీద వచ్చే ఆదాయం లేకపోతే.. సంక్షేమ పథకాల అమలు అన్నది దాదాపుగా అసాధ్యం. అందుకే ఏ ప్రభుత్వాలు కూడా ధైర్యం చేసి సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని ప్రకటించవు.. ఒకవేళ ఎన్నికల ముందు అలా హామీ ఇచ్చినా.. అమలు చేయవు. కానీ తాజాగా ఓ రాష్ట్ర ప్రభుత్వం మద్యపానం దిశగా అడుగులు వేస్తోంది. ఆ వివరాలు..
తమిళనాడు ప్రభుత్వం మద్యపాన నిషేధం అమలు దిశగా అడుగులు వేస్తోంది. డీఎంకే ప్రభుత్వం.. రాష్ట్రంలో విడతల వారీగా మద్యపాన నిషేధం చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ విషయాన్ని అసెంబ్లీ వేదికగా ప్రకటించింది. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా 5 వేలకు పైగా మద్యం దుకాణాలు ఉండగా.. విడతల వారీగా వాటిని ముసివేస్తామని ప్రకటించారు. దీనిలో భాగంగా తొలి విడతగా.. 500 మద్యం షాపులను మూసివేయనున్నట్లు డీఎంకే మినిస్టర్ ప్రకటించారు. ఈ నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇక 2021లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ అన్ని పార్టీల ప్రధాన అస్త్రం మద్యపాన నిషేధమే అయ్యింది. తమిళనాడు అనే కాదు.. ఎన్నికల వేళ చాలా రాష్ట్రాల్లో మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇస్తారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది నేతలు ఆ దిశగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేయరు. కానీ స్టాలిన్ మాత్రం ఈ విషయంలో మాట మీద నిలబడుతున్నాడు. మరి ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.