జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలుగు రాష్ట్రాలే కాదు.. దేశవ్యాప్తంగా సమకాలీన రాజకీయాలపై స్పందిస్తుంటారు. మంచిని పొగడటం.. తప్పుని విమర్శించడం పవన్ సహజ గుణం. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ నిర్ణయాలు, పరిపాలనా విధానాలను కీర్తిస్తూ పవన్ కల్యాణ్ ఓ ట్వీట్ చేశారు. పవన్ పేరు ఉంటేనే ఆ అంశం తెగ వైరల్ అవుతుంది. అదే నేరుగా పవన్ ట్వీట్ చేస్తే మరి ఎలా ఉంటుంది. ఆ ట్వీట్ తమిళనాడు అసెంబ్లీలో ప్రస్తావించే వరకు వెళ్లింది.
Discussion About @PawanKalyan garu’s Tweet On TN CM M.K.Stalin Sir In Tamilnadu State Assembly 🔥pic.twitter.com/Tf04nbgXyz
— రాజోలు అబ్బాయి పవన్ (@Pawan_JSP_RZL) September 3, 2021
పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్‌ని తమిళనాడు అసెంబ్లీలో ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణ్యన్ చదివి వినిపించారు. తెలుగులో చదివి దానిని మళ్లీ తమిళంలో చెప్పి వినిపించారు. ఆ సందర్భంగా మంత్రి సీఎం స్టాలిన్ పొగుడుతూ వ్యాఖ్యలు చేశారు. తనని పొగిడితే చర్యలుంటాయన్న స్టాలిన్ మాటని మీరిన మంత్రిపై ఏం చర్యలు తీసుకుంటారో అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది కూడా.
To Hon. CM @mkstalin garu, pic.twitter.com/iIo0YMD1vT
— Pawan Kalyan (@PawanKalyan) August 31, 2021
‘ఏ పార్టీ అయినా ప్రభుత్వంలోకి రావడానికి రాజకీయం చేయాలి కానీ, ప్రభుత్వంలోకి వచ్చాక రాజకీయం చేయకూడదు. ఈ మాటలను సీఎం స్టాలిన్ మాటల్లో కాదు, చేతల్లో చేసి చూపించారు. మీ పరిపాలన దేశంలోని అన్ని రాష్ట్రాలకు మార్గదర్శనం, స్ఫూర్తిదాయకం’ అంటూ పవన్ ప్రశంసల వర్షం కురిపించారు.