కరోనా వచ్చినప్పటి నుంచి దేశంలోని చాలా నగరాల్లో డెలివరీ సంస్థలు ఎంతో అభివృద్ధి చెందాయి. వాటివల్ల ఎన్నో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కూడా లభించాయి. ప్రస్తుతం స్విగ్గీలాంటి డెలివరీ సంస్థలు తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు తగు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. తమను నమ్మి ఎన్నో ఏళ్లుగా డెలివరీ పార్టనర్స్ గా పనిచేస్తున్న వారిని మేనేజర్లుగా ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు స్విగ్గీ సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది. డెలివరీ బాయ్స్ ను పర్మినెంట్ ఉద్యోగస్థులుగా మార్చే యోచనలో ఉంది. తమ వద్ద ఉండే డెలివరీ బాయ్స్ ను పూర్తిస్థాయి ఉద్యోగులుగా తీసుకోవడమే కాకుండా.. స్థిరమైన ఆదాయం, అదనపు ప్రయోజనాలు కల్పిస్తామని ఆ సంస్థ వెల్లడించింది. డెలివరీ బాయ్స్ గా పనిచేస్తున్న వారిని స్టెప్ ఏ హెడ్ అనే కార్యక్రమం నిర్వహించి ఉద్యోగాల్లో చేరే అవకాశం కల్పిస్తోంది.
ఇదీ చదవండి: నిరుద్యోగులకు శుభవార్త.. పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల!
ఆ వివరాలను స్విగ్గీ సంస్థ నిర్వహణ ఉపాధ్యక్షుడు స్వయంగా వెల్లడించారు. ‘డెలవరీ బాయ్స్ మా సంస్థకు వెన్నెముక వంటివారు. భారతదేశంలో మాకు 2.7 లక్షల మంది వరకు మేము ఆదాయ అవకాశాలు కల్పించాం. పార్ట్ టైమ్ జాబ్, ఎక్స్ ట్రా ఇన్ కమ్ కోసం పనిచేసే వారున్నారు. అలాంటి వారికోసమే మేము అదనపు అవకాశాలు కల్పించాలని నిర్ణయించుకున్నాం. డెలివరీ బాయ్స్ గా ఉన్నవారికి వైట్ కాలర్ జాబ్ ఆఫర్ చేస్తున్నాం’ అంటూ మిహిర్ రాజేశ్ తెలిజేశారు.
ఈ పోస్టుకు ఎవరు అర్హులు అంటే..
డెలివరీ బాయ్స్ లో 20 శాతం మందికి ఈ అవకాశం కల్పించేందుకు స్విగ్గీ సంస్థ సిద్ధమైంది. వీరు ఫ్లీట్ మేనేజర్లుగా వివిధ రకాల విధులు నిర్వహించాల్సి ఉంటుంది. స్టెప్ ఏ హెడ్ ద్వారా స్విగ్గీ కల్పిస్తున్న జాబ్ పొందాలంటే డెలివరీ ఎగ్జిక్యూటివ్ గా చేసే వ్యక్తి డిగ్రీ చదివి ఉండాలి. డిగ్రీతో పాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలని చెబుతున్నారు. అంతేకాకుండా వారికి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా తప్పకుండా ఉండాలి. వీరి విధులు ఏ విధంగా ఉంటాయంటే.. డెలివరీ బాయ్స్ లాగిన్ అవర్స్, క్యాన్సిలేషన్స్, ప్రాబ్లమ్స్ పరిష్కరించడం చేయాలి. అప్లై చేసుకున్న వారిలో ఎక్కువ కాలంగా డెలివరీ పార్టనర్స్ గా చేసినవారికే మొదటి ప్రాధాన్యత ఉండనున్నట్లు చెబుతున్నారు. స్విగ్గీ సంస్థ కల్పిస్తున్నా ఈ అవకాశంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.