ఆర్య సమాజ్ లో జరిగే వివాహాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఇక నుంచి ఆర్య సమాజ్ లో జరిగే పెళ్లిళ్లను తాము గుర్తించబోమని తీర్పు ఇచ్చింది. ఇకపై ఆర్య సమాజ్ లో ఇచ్చే వివాహ ధ్రువీకరణ పత్రాలు చెల్లబోవని, వాటిని గుర్తించబోమని స్పష్టం చేసింది. పెళ్లిళ్లు చేయడం ఆర్య సమాజ్ పని కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
దేశవ్యాప్తంగా పెరుగుతున్న పరువుహత్యలు, కులాంతర వివాహలపై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పై జరిపిన విచారణలో భాగంగా ఈ తీర్పును వెలువరించారు. సాధారణంగా పెద్దల అంగీకరించకపోయినా.. కులాంతర వివాహం చేసుకోవాలన్నా ఆర్య సమాజ్ లో వివాహం చేసుకునే వారు. పెద్దల అంగీకారంతో సంబందం లేకుండా ఆర్య సమాజ్ లో వివాహాలు జరిపేవారు. ఇక నుంచి అవన్నీ చెల్లవని సుప్రీకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
While refused to accept a marriage certificate issued by Arya Samaj,
the Supreme Court said,“Arya Samaj has no business giving marriage certificate. This is the work of authorities. Show the real certificate.”#AryaSamaj #MarriageCertificate
— Brij Dwivedi (@Brij17g) June 3, 2022