గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా హిజాబ్ వివాదం సంచలనాలు రేపింది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన హిజాబ్ వివాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. డా.జే హల్లీ ఫెడరేషన్ ఆఫ్ మసీద్ మదారిస్, వక్ఫ్ సంస్థలు ఈ పిటిషన్ వేశాయి. హైకోర్టు ఇచ్చిన తీర్పు ముస్లిం మహిళల ప్రాథమిక హక్కులను కాలరాసేలా ఉందని పిటిషన్లో పేర్కొన్నారు.
ఈ వివాదాన్ని జాతీయ స్థాయి అంశంగా మార్చొద్దని.. రాజ్యంగం ఇచ్చిన హక్కులను కాపాడాలని సుప్రీం కోర్టు పేర్కొంది. హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పుపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన విటిషన్‌పై విచారణకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. దీన్ని దేశవ్యాప్త సమస్యగా మార్చవద్దని న్యాయవాదులకు సుప్రీం కోర్టు సూచించింది. సరైన సమయంలో ఈ కేసును విచారణకు అనుమతిస్తాం. కర్ణాటకతో పాటు ఆ రాష్ట్ర హైకోర్టులో ఏం జరుగుతుందో మేం గమనిస్తున్నాం. హిజాబ్ అంశంపై సరైన సమయంలో జోక్యం చేసుకుంటాం. దీన్ని దేశవ్యాప్త సమస్యగా మార్చవద్దని న్యాయవాదులకు సూచిస్తున్నాం అంటూ సుప్రీం ధర్మాసనం పేర్కొంది.